వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ దారి మళ్లింపు, పొగమంచుతో అబూదబీలో...

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొలంబియా: అమెరికాకు చెందిన ఓ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అధికారులు దానిని దారి మళ్లించారు. కొలంబియాలోని బోగోటా నుండి మియామి వెళ్తున్న ఫ్లైట్ 916 బోయిగ్-767 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో విమానాన్ని జమైకాలోని కింగ్‌స్టన్‌కు మళ్లించారు. ఈ విమానంలో 197 మంది ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అమెరికన్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి కెసె నోర్టన్ తెలిపారు.

Plane

మంగళవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఆ విమానం ల్యాండ్ అయింది. ఈ విమానంలో 197 మంది ప్రయాణీకులతో పాటు 9 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీలు చేశారు. ప్రయాణీకులను మియామి తీసుకు వెళ్తామని చెప్పారు.

పొగమంచుతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు

పొగమంచు కారణంగా అబూదబీలో విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పొగమంచు కారణంగా పలు విమానాలను మళ్లించారు. అబూదబీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే సోమవారం మూసివేశారు.

English summary
An American Airlines flight made an emergency landing Monday after a pilot reported a pressurization issue, a spokesman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X