ట్రంప్ తో కంప్లీట్ కటీఫ్- బాంబు పేల్చిన మోదీ
టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తోన్నందున భారత్ పై కొరడా ఝుళిపిస్తోన్నారు. క్రమంగా ఇది రెండు దేశాల మధ్య తీవ్ర అగాథాన్ని సృష్టిస్తోంది. దౌత్య సంబంధాలు దెబ్బతినేంత వరకూ వెళ్లిందీ పరిస్థితి.
రష్యాను డొనాల్డ్ ట్రంప్ బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా భారత్ పై 50 శాతం టారిఫ్ భారం పడింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
తాజాగా భారత్ తో ట్రేడింగ్ చర్చలపై మరోసారి తన వైఖరిని బయటపెట్టారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ అంశంపై భారత్ తో గానీ.. ఆ దేశ ప్రతినిధులతో గానీ చర్చించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించుకునేంత వరకూ భారత్ తో ఎటువంటి ట్రేడ్ నెగోషియేష్స్ కూడా ఉండబోవని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడారు. కొద్దిసేపటి కిందటే ఈ సంభాషణ సాగింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి.
తమ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ- పుతిన్ పునరుద్ఘాటించారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడాన్ని మోదీ సమర్థించుకున్నారు. దేశ ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వం కోసం మున్ముందు క్రూడాయిల్ కొనుగోళ్లు కొనసాగుతాయనీ స్పష్టం చేశారు.
Had a very good and detailed conversation with my friend President Putin. I thanked him for sharing the latest developments on Ukraine. We also reviewed the progress in our bilateral agenda, and reaffirmed our commitment to further deepen the India-Russia Special and Privileged…
— Narendra Modi (@narendramodi) August 8, 2025
ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక అజెండాలో పురోగతిని మోదీ, పుతిన్‌లు సమీక్షించారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిపారు. అలాగే- ఉక్రెయిన్‌కు సంబంధించిన తాజా పరిణామాలను ప్రధాని మోదీకి వివరించారు పుతిన్.
ఉక్రెయిన్ తో తలెత్తిన సంక్షోభానికి శాంతియుతంగా పరిష్కారాన్ని కనుగొనాలని కోరుకుంటోన్నానని మోదీ తెలిపారు. ఈ ఏడాది చివర్లో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్‌ను భారత్ కు ఆహ్వానించారు ప్రధాని మోదీ. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications