మరోసారి కారు బాంబు పేలుడు: పలువురు దుర్మరణం

ఢిల్లీలో కారు పేలుడు ఘటనను మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు వెలుపల మంగళవారం నాడు జరిగిన కారు బాంబు పేలుడులో దాదాపు 12 మంది మరణించగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.పేలుడు సంభవించిన ప్రాంతం ఇస్లామాబాద్‌లోని విశాలమైన జిల్లా కోర్టు బయట ఉంది. మరణించిన వారిలో ఎక్కువ మంది అటుగా వెళ్తున్న ప్రయాణికులు లేదా కోర్టు విచారణలకు హాజరు కావడానికి వచ్చిన పౌరులేనని పాకిస్తాన్ మీడియా తెలిపింది. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు.

మైళ్ల దూరం వరకు వినిపించిన ఈ పేలుడు ధాటికి.. కోర్టు వెలుపల పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సాధారణంగా కోర్టు విచారణల కారణంగా ఈ ప్రాంతం వందలాది మంది సందర్శకులతో రద్దీగా ఉంటుంది. ఇస్లామాబాద్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

Another Car Bomb Blast Multiple Deaths Reported in Islamabad

ఉగ్రవాద బెడద
ఈ పేలుడుకు సంబంధించి ఏ గ్రూపు కూడా తక్షణమే బాధ్యత ప్రకటించలేదు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడుల బెడద తీవ్ర సమస్యగా మారింది. మంగళవారం ఉదయం పాకిస్తాన్ భద్రతా దళాలు మరో ఉగ్రదాడి ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. వాయవ్య ప్రావిన్స్‌లోని ఆర్మీ నడుపుతున్న ఒక కేడెట్ కళాశాలను లక్ష్యంగా చేసుకొని సోమవారం రాత్రి ఒక ఆత్మాహుతి కారు బాంబర్, మరో ఐదుగురు పాకిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించగా.. భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి.

ఈ దాడి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని వానా నగరంలో జరిగింది. ఈ ప్రాంతం ఇటీవల సంవత్సరాల వరకు పాకిస్తాన్ తాలిబాన్, అల్-ఖైదా, ఇతర విదేశీ మిలిటెంట్లకు స్థావరంగా ఉండేది.ఇస్లామాబాద్‌లో తాజాగా జరిగిన కారు బాంబు పేలుడు దేశ భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనను పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+