నరహత్య: ముగ్గురు పిల్లల్ని చంపి, చిన్నోడిని సూట్‌కేసులో
ఫానెక్స్: అమెరికాలోని ఆరిజోనాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లల్ని కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపేసి ఓ గదిలో పడేసింది. ఆ తర్వాత తాను కూడా పొడుచుకుంది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగొచ్చిన ఆమె సోదరుడు ఇంట్లో జరిగిన ఘోరం చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది.
సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... అఘాయిత్యానికి పాల్పడిన యువతి అమెరికాలోని ఆరిజోనాలోని దక్షిణ ఫానెక్స్‌లో తల్లి, నానమ్మతో కలిసి జీవిస్తోంది.
అయితే ఏమైందో తెలియదు గానీ తన ముగ్గురు పిల్లలను దారుణంగా చంపేసి, ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత ఆమె ఒక్కతే ఈ అఘాయిత్యానికి పాల్పడిందనుకున్న పోలీసులు, ఇంట్లోని రక్తపు మడుగుని చూసి ఇంకా ఎక్కువ మంది ఉన్నారని నిర్ధారించుకున్నారు.

ఇంటిని మొత్తం వెతకగా ఓ గదిలో పడి ఉన్న చిన్నారుల మృతేదేహాలను పోలీసులు గుర్తించారు. 8 ఏళ్ల వయసున్న జైకిరె రెహ్మాన్, 5 ఏళ్ల ఆడమ్స్, రెండు నెలల అవరీ రాబిన్సన్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
రాబిన్సన్ మృతదేహాన్ని ఓ సూటికేసులో కనుగోన్నారు. దీనిని బట్టి ఇది నరహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతి పొట్ట, మెడ భాగంలో కూడా తీవ్ర గాయాలున్నాయని ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆమెను ఆక్టోవియా రోజర్స్ (29)గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే పొత్తికడుపులో పొడుచుకోవడానికి అది కూడా ఓ కారణం అయి ఉండొచ్చని పేర్కొన్నారు.
ఈ ఘటనపై డీసీఎస్ డైరెక్టర్ గ్రెగ్ మెకాకే మాట్లాడుతూ సంఘటన వెనుకున్న కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications