అల్జీరియాలో సైనిక విమానం కూలి 103 మంది మృతి
అల్జీర్స్: అల్జీరియాలో మంగళవారం ఓ సైనిక విమానం పర్వతమయ ఈశాన్య ప్రాంతంలో కూలి పోవడంతో 103 మంది దుర్మరణం చెందారు. అయిదు దశాబ్దాల కాలంలో ఇంత ఘోర విమాన ప్రమాదం అల్జీరియాలో జరగలేదని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.

దేశ రాజధానికి 380 కిలోమీటర్ల దూరంలోని అవుమ్‌ఎల్ పవాగీ ప్రాంతంలో వాతావరణం సరిగా లేనందున సి-130 అనే హెర్క్యులస్ విమానం కూలిపోయిందని అల్జీరియా రేడియో ప్రకటించింది. ఇందులో సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, నలుగురు సిబ్బందితో సహా అందరూ మరణించారని అధికారులు చెప్పారు.
కాన్సాంటిన్ పట్టణానికి వెళుతున్న ఈ విమానం పర్వత ప్రాంతంలో తక్కువ ఎత్తులో పయనించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications