నెమలి సింహాసనం ఇరాన్ చేరిన రోజు.. ప్రతీకారం కోరుతోందా?

ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు, భద్రతా సమీకరణలు అన్నీ కూడా ఇరాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, పవర్ పాలిటిక్స్ ... ఇవన్నీ ఇరాన్‌ను గ్లోబల్ ఫోకస్‌లో నిలిపాయి. ఇరాన్ దేశంలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రక్తసిక్తంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనల్లో ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంలోనే చరిత్రకారులు ఒక అపురూప అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు.. అదే భారత నెమలి సింహాసనం (Peacock Throne).

ఒకప్పుడు భారత ఉపఖండ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ సింహాసనం, నేడు ఇరాన్ చరిత్రతో ముడిపడి ఉండటం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిరస్థాయిగా నిలిచిన నెమలి సింహాసనాన్ని, చక్రవర్తి షాజహాన్ 1628లో తయారు చేయించారు. ఇది కేవలం ఒక రాజసింహాసనం కాదు.. ఇది భారత సంపద, కళా నైపుణ్యం, సామ్రాజ్య శక్తికి అద్దం పట్టే కళాఖండం.

As Iran Dominates Global Headlines Historians Recall India s Lost Peacock Throne

నెమలి సింహాసనాన్ని స్వర్ణకారులు ఏడేళ్ల పాటు నిరంతరంగా శ్రమించి, సుమారు 1150 కిలోల బంగారాన్ని ఉపయోగించి.. 230 కిలోల విలువైన మణులు,రత్నాలతో అలకరించి ఈ అద్భుత సృష్టిని రూపొందించారు. ఈ సింహాసనంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రత్నాలు పొదగబడ్డాయి. ప్రఖ్యాత కోహినూర్ వజ్రం, పౌరాణిక ఖ్యాతి గల తైమూర్ రూబీ, మాణిక్యాలు, పచ్చలు, ముత్యాలు... అన్నీ కలిసి ఈ సింహాసనాన్ని ప్రపంచంలోనే అత్యంత విలువైన కళాఖండంగా నిలిపాయి. నెమలి ఆకారంలో రూపొందించిన ఈ సింహాసనం, మొఘల్ రాజసభకు శోభనిచ్చేది.

కాలచక్రం తిరిగింది. 18వ శతాబ్దానికి వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అదే సమయంలో పర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీపై దాడి చేశాడు. 1739లో జరిగిన ఈ ఆక్రమణ భారత చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనగా మిగిలిపోయింది. ఢిల్లీని దోచుకున్న నాదిర్ షా, అపార సంపదతో పాటు.. నెమలి సింహాసనాన్ని కూడా ఇరాన్‌కు తీసుకెళ్లాడు.అది కేవలం దోపిడీ కాదు... భారత వైభవానికి జరిగిన ఒక చారిత్రక అవమానం.

నెమలి సింహాసనం అసలు రూపంలో నేటికి లెకపోయినా, అది ఇరాన్ రాజవంశాలపై గాఢమైన ప్రభావం చూపింది. ఇరాన్‌లోని రాజసభల వైభవం, సింహాసన రూపకల్పనలు.. అన్నింటిలోనూ భారతీయ కళా ప్రభావం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే... భారత సంపద, కళా నైపుణ్యం ఇరాన్ రాజశక్తికి ప్రతీకగా మారింది.

నేడు ఇరాన్ ఎదుర్కొంటున్న రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఒత్తిళ్లు, అంతర్గత నిరసనలు చూస్తుంటే... చరిత్ర మళ్లీ ఒక ప్రశ్న వేస్తోంది. ఆక్రమణల ద్వారా తెచ్చుకున్న వైభవం, సంపద శాశ్వత స్థిరత్వాన్ని ఇవ్వగలదా? అని. నాదిర్ షా అపార సంపదను భారత్ నుంచి తీసుకెళ్లినా, అతని పాలన ఎక్కువకాలం నిలబడలేదు. అతని సామ్రాజ్యం కూడా కాలగర్భంలో కలిసిపోయింది.

భారత్‌కు నెమలి సింహాసనం ఒక కళాఖండం మాత్రమే కాదు.అది ఒక చరిత్రాత్మక గాయం, ఒక తీరని నష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కళాఖండాల తిరిగి రాకపై చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో, నెమలి సింహాసనం పేరు తప్పకుండా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు ఇరాన్ చుట్టూ తిరుగుతున్న వేళ, భారత నెమలి సింహాసనం కథ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది.

శక్తి, సంపద, ఆక్రమణలపై నిర్మితమైన వైభవం శాశ్వతం కాదు. చరిత్ర చివరికి తన తీర్పు ఇస్తుంది. కాలం మారినా... దేశాలు మారినా... చరిత్ర చెప్పే పాఠాలు మాత్రం మారవు. మరి నిజంగానే నెమలి సింహాసనం ప్రతీకారం కోరుతోందా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+