Operation Kaveri: సూడాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 360 మంది..
సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. "ఆపరేషన్ కావేరీ(OperationKaveri)" కింద ఈ సాయంత్రం మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుంది. " #OperationKaveri లో మొదటి విమానం న్యూఢిల్లీకి చేరుకున్న 360 మంది భారతీయ జాతీయులను తీసుకొచ్చాం" అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా కౌంటర్‌తో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. సూడాన్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గత శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
India welcomes back its own. #OperationKaveri brings 360 Indian Nationals to the homeland as first flight reaches New Delhi. pic.twitter.com/v9pBLmBQ8X
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 26, 2023
సూడాన్ ఉన్న భారతీయులను రక్షించేందుకు "ఆపరేషన్ కావేరి" చేపట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ కావేరి అనేది సూడాన్ సైన్యం, పారామిలిటరీ గ్రూపులు పోరాడుతున్న సూడాన్ నుండి చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం ప్రారంభించిన రెస్క్యూ మిషన్. దేశాలు తమ పౌరులను సూడాన్ నుంచి ఖాళీ చేయించడంలో నిమగ్నమై ఉన్న సమయంలో యుఎస్, సౌదీ అరేబియా మధ్యవర్తిత్వంతో సూడన్‌లో పోరాడుతున్న వర్గాలు సోమవారం 72 గంటల కాల్పుల విరమణకు అంగీకరించాయి.

ఆపరేషన్ కావేరిలో భాగంగా భారత్ జెడ్డాలో రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. భారతీయులందరినీ మొదటగా సూడాన్ నుంచి తరలించిన తర్వాత తీరప్రాంత సౌదీ అరేబియా నగరానికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఇండియాకు తీసుకొస్తారు. తరలింపు మిషన్‌ను పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ జెడ్డాలో ఉన్నారు. గత శనివారం సౌదీ అరేబియా విదేశీ దేశాలకు చెందిన 66 మంది పౌరులను సూడాన్ నుంచి రక్షించింది. ఇందులో కొంతమంది భారతీయ పౌరులు ఉన్నట్లు తెలిపింది.
WHO ప్రకారం ఏప్రిల్ మధ్య నుంచి సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) పారామిలిటరీ మధ్య జరిగిన పోరాటాల్లో కనీసం 459 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు రెండు వారాల పట్టణ పోరాటం విదేశీయుల భారీ వలసలకు దారితీసింది. విదేశీ ప్రభుత్వాలు వేలాది మంది తమ జాతీయులను సూడాన్ నుంచి బయటకు తీసుకురావడానికి రోడ్ కాన్వాయ్‌లు, విమానాలు, నౌకలను ఏర్పాటు చేస్తున్నాయి.
-
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications