యుద్దమే! సిద్దంగా ఉండాలంటూ సైన్యానికి కిమ్ ఆదేశం: కొరియన్ వార్-2 దిశగా..
రెండో కొరియన్ యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
ప్యోంగ్‌యాంగ్: ప్రత్యర్థి తమపై దాడి మొదలుపెట్టకముందే అప్రమత్తంగా వ్యవహరించాలని భావిస్తున్న అమెరికా.. ఇందుకోసం దక్షిణ కొరియా సహాయంతో అక్కడ తమ బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.
దాదాపు 17,500మంది అమెరికన్ 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు దక్షిణ కొరియాలో ఉల్కీ-ఫ్రీడమ్ గార్డియన్ మిలటరీ డ్రిల్ చేపడుతున్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మిలటరీ డ్రిల్ అగస్టు 31వ తేదీన ముగియనుంది.
ఈ పరిణామాలతో ఆందోళన చెందుతుందనుకున్న ఉత్తరకొరియా అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. కాళ్లబేరానికి రావడమో.. లేక యుద్దం ఆలోచనను పూర్తిగా విరమించుకుంటామని ఆ దేశం ప్రకటిస్తుందని అమెరికా భావించినప్పటికీ.. పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.

రెండో కొరియన్ యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ సైనికులకు ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. 1950లో దక్షిణకొరియా-ఉత్తరకొరియా మధ్య తొలి కొరియన్ యుద్దం చోటు చేసుకుంది.
కాగా, అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా చేబడుతున్న ఉల్కీ-ఫ్రీడమ్ గార్డియన్ మిలటరీ డ్రిల్‌లో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, నెదర్లాండ్, న్యూజిలాండ్ అధికారులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
రోజురోజుకు అమెరికాకు మద్దతు పెరుగుతుండటం.. తమ బద్ద శత్రువైన దక్షిణ కొరియా ఆ దేశానికి స్థావరంలా మారడం ఉత్తరకొరియాను కలవరపెట్టే అంశమే. అయినప్పటికీ ఆ దేశం పరిస్థితులను ధీటుగా ఎదుర్కోవాలనే భావిస్తుందే తప్ప.. వెనక్కి తగ్గాలన్న ఆలోచన చేయడం లేదు.
ఇందుకు తగ్గట్లే ఉత్తరకొరియా మీడియాలోను వార్తలు రావడం గమనార్హం. అమెరికా-దక్షిణ కొరియా చేపట్టబోతున్న మిలటరీ డ్రిల్ ను అక్కడి పత్రిక 'అణు యుద్దానికి నిర్లక్ష్యపూరిత కసరత్తులు' అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు నియంత్రణ లేని అణుయుద్దానికి దారితీస్తాయని దారి తీస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications