రెండు పడవల మునక: 32మంది మృతి
కౌలాలంపూర్/మాలీ: మలేషియా, మాలీలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 32మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి ఘటన వివరాల్లోకి వెళితే.. మలేషియా పశ్చిమ తీర ప్రాంతంలోని మలక్కా జలసంధి వద్ద ఓ వలసదారుల పడవ మునిగిపోయింది.
పడవలోని 70 మంది ఇండోనేషియా వాసుల్లో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పడవలో 70 మంది ప్రయాణిస్తున్నట్లు చెప్తున్నా దాదాపు 100 మందిని ఎక్కించుకున్నట్లు స్థానిక జాలర్లు చెబుతున్నారు.
ఘటనాస్థలికి 12 పడవలతో పాటు 200 మంది సహాయక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. 13 మృతదేహాలు వెలికితీయగా మరో 13 మందిని రక్షించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
బాధితులని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారు మలేషియాకి వస్తున్నారా లేక అనుమతి లేకుండా మలేషియా నుంచి వెళ్లిపోతున్నారా అన్న విషయమై బాధితుల నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు.

మాలిలో పడవ మునక: 19 మంది మృతి
బమాకో: పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశంలో మరో పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో ఓ పడవ మునిగిపోవడంతో 19 మంది మృతిచెందారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం స్ధానిక బాంగో ప్రాంతానికి 140 కి.మీ.ల దూరంలో ఉన్న నైగర్ నదిలో ఓ పడవ అదుపుతప్పి మునిగిపోయింది.
దీంతో 19 మంది మృతిచెందగా మరో నలుగురు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది సుమారు 70 మందిని రక్షించగలిగారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల జరిగిందా లేక అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications