కూరగాయల మార్కెట్లో భారీ పేలుడు: 18 మంది మృతి
పాకిస్థాన్‌లోని ఖుర్రం ఏజెన్సీ మార్కెట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఖుర్రం ఏజెన్సీ మార్కెట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఏజెన్సీలోని పరాచినార్ ప్రాంతంలోని సాబ్జి మాండి (కూరగాయల మార్కెట్)లో జరిగిన పేలుడులో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు.
మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఐఈడీ బాంబు పేలినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇలాంటి పేలుడు ఘటనే ఈద్గా మార్కెట్‌లో డిసెంబర్ 2015లో జరిగగా, అప్పుడు 25మంది ప్రజలు చనిపోగా, 70మంది గాయాలపాలయ్యారు.












Click it and Unblock the Notifications