బట్టల కోసం తొక్కిసలాట: 20 మంది పేదలు బలి

ఢాకా: ముస్లీంలకు పవిత్రమైన రంజాన్ పండుగ సందర్బంగా పేదలకు బట్టలు పంపిణి చేస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించిన సంఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. బంగ్లాదేశ్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రంజాన్ పండగ సందర్బంగా ముస్లీంలు జకాత్ నిర్వహిస్తారు. జకాత్ అంటే ముస్లీంలు రంజాన్ పండగ నుండి వచ్చే రంజన్ పండుగ వరకు సంపాదించిన సోమ్మలో కొంత భాగాన్ని అదే పండుగ సందర్బంగా పేదలకు, ఆపదలో ఉన్న వారికి దానం చేయడం అని అర్థం.

 at least 20 people killed in Bangladesh

రంజాన్ పండుగ సందర్బంలో ప్రపంచదేశాలలోని ముస్లీంలు ఈ జకాత్ నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ లోని మైమెన్ నగరంలోని ఒక పొగాకు ఫ్యాక్టరీ దగ్గర శుక్రవారం జకాత్ నిర్వహించారు. పేదలకు బట్టలు పంచుతున్న సమయంలో ఒక్క సారిగా 1,500 మందికి పైగా చేరుకున్నారు.

తమకు బట్టలు చిక్కుతాయో లేదో అని ఆందోళనతో ముందుకు పరుగు తీశారు. ఆ సందర్బంలో జరిగిన తొక్కిసలాటలో మెయిన్ గేట్ దగ్గర 20 మంది మరణించారు. అనేక మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రులకు తరలించారు. జకాత్ నిర్వహించిన వారు సరైన చర్యలు తీసుకొకపోవడం వలనే ఇలా జరిగిందని సీనియర్ పోలీసు అధికారి మోనల్ హక్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+