కాబూల్‌లో భారీ పేలుడు: ఐదుగురు మృతి, ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. మంగళవారంనాడు జరిగిన ఈ పేలుడులో కనీసం ఐదుగురు మరణించారని స్థానిక టీవీ చానెళ్లు చెబుతున్నాయి. దాదాపు 42 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆత్మాహుతి దాడిగా దాన్ని భావిస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు సమీపంలోనే ఈ పేలుడు సంభవించింది. జస్టిస్ మంత్రిత్వ శాఖ పార్కింగ్ స్థలంలోని కారులో ఈ పేలుడు సంభవించింది. సెరెనా హోటల్ సమీపంలోనే అది ఉంది.

పేలుడు తీవ్రత భయానకంగా ఉంది. దాని ధాటికి కిలోమీటర్ల దూరం వరకు భవనాల అద్దాలు పగుళ్లు వారాయి. పోలీసు కార్లలో, అంబులెన్స్‌ల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడింది ఏ సంస్థ అనేది ఇంకా తెలియలేదు.
కాబూల్ అతిథి గృహంలో వారం క్రితం జరిగిన దాడికి తామే కారణమని తాలిబాన్ ప్రకటించకుంది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. వారిలో 9 మంది విదేశీయులున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications