వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Australia earthquake: వణికిన మెల్‌బోర్న్: భవనాలు ధ్వంసం

|
Google Oneindia TeluguNews

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో భారీ భూకంపం సంభవించింది. రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్ సమీపంలో సంభవించిన భూప్రకంపనల తీవ్రత అనూహ్యంగా ఉంటోంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా రికార్డయింది.

ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతంలోని మౌంట్ బుల్లర్‌ను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. మౌంట్ బుల్లర్.. మెల్‌బోర్న్‌కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మౌంట్ బుల్లర్‌కు ఈశాన్యాన 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న మ్యాన్స్‌ఫీల్డ్ టౌన్‌లో భూకంపం సంభవించినట్లు జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న మార్పులు దీనికి కారణమని పేర్కొంది.

Australia earthquake: A magnitude 5.8 earthquake caused damage in the city of Melbourne

ఆస్ట్రేలియాలో సంభవించిన రెండో అతి పెద్ద భూకంపంగా దీన్ని భావిస్తున్నారు. మూడు సంవత్సరాల తరువాత 5.8 తీవ్రతతో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి అని ఆస్ట్రేలియా జియోసైన్స్ తెలిపింది. 2019లో బ్రూమె టౌన్‌ సమీపంలో 6.6 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. 50 వేలకు పైగా భవనాలు, ఇతర నివాస సముదాయాలు ధ్వంసం అయ్యాయి. ఆ స్థాయిలో మళ్లీ భూమి కంపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

దీని తీవ్రత మెల్‌బోర్న్‌పై కనిపించింది. మెల్‌బోర్న్‌లోని సౌత్ యర్రాలో పలు భవనాలు కంపించాయి. ధ్వంసం అయ్యాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనాల శిథిలాలు మీద పడి కొందరు వాహనదారులు సైతం గాయపడ్డారు. వాటి పక్కన పార్క్ చేసి ఉంచిన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రధాన భూకంపం తీవ్రత తగ్గిన తరువాత కూడా స్వల్పస్థాయిలో ప్రకంపనలు ఏర్పడటంతో ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి భయపడ్డారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను ఆహ్వానించిన ఐక్యరాజ్య సమితి: సర్వసభ్య సమావేశంలో తాలిబన్ల ప్రసంగంఆఫ్ఘనిస్తాన్‌ను ఆహ్వానించిన ఐక్యరాజ్య సమితి: సర్వసభ్య సమావేశంలో తాలిబన్ల ప్రసంగం

Recommended Video

5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu

సమాచారం అందుకున్న వెంటనే ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనాల శిథిలాలను తొలగించడంలో నిమగ్నం అయ్యారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీశారు. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి స్కాట్ మోరిస్ స్పందించారు. భూకంపం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా సమాచారం అందలేదని వ్యాఖ్యానించారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలంటూ ఆయా నగరాల మేయర్లను ఆదేశించినట్లు చెప్పారు.

English summary
The magnitude 5.8 earthquake struck in second biggest city Melbourne in Australia. The epic centre was 38 kilometers south of Mount Buller in the country’s south east, according to the U.S Geological Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X