ఉగ్రదాడి: దేశాధ్యక్షుడి కాన్వాయ్ పేల్చివేత
ట్యునిష్: ఉగ్రవాదులు మరో దేశం మీద విరుచుకుపడ్డారు. ఈసారి ఉగ్రవాదుల లక్షం ఆదేశాధ్యక్షుడు. అయితే బాంబు పేలుడు జరిగిన సమయంలో ఆ కాన్వాయ్ లో అధ్యక్షుడు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా రాజధాని ట్యునిష్ నగరం నడిబొడ్డున అధ్యక్షుడి కాన్వాయ్ లోని బస్సును శక్తివంతమైన బాంబులతో పేల్చి వేశారు. ఈ ఉగ్రదాడిలో ట్యునీషియా అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ అంగరక్షకులు 15 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ట్యనీషియా రాజధాని ట్యునిష్ నగరం నడిబొడ్డున అధ్యక్షుడి కాన్వాయ్ వెలుతున్నది. ఇదే కాన్వాయ్ లో ఆయన అంగరక్షకులు ఓ బస్సులో ప్రయాణిస్తున్నారు.

ఉగ్రవాదులు దేశాధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీని టార్గెట్ చేసుకుని బాంబుదాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ కాన్వాయ్ లో అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ లేరని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడి ఉంటారని అధికారులు తెలిపారు.
నెల రోజుల పాటు ట్యునీషియాలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. ప్యారిస్ లో ఉగ్రదాడి జరిగిన తరువాత ఫ్రాన్స్ లో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు ట్యునిష్ లో ఈ ఉగ్రదాడి జరగడంతో ట్యునీషియా లో నెల రోజులు ఎమర్జెన్సీ విధించారు.












Click it and Unblock the Notifications