భారత్-పాక్ మధ్య యుద్ధం తప్పదా.. వంగ బాబా భవిష్యవాణి ఏంటి ?

భవిష్యవాణి.. కొందరు ఈ విషయాన్ని నమ్మవచ్చు.. కొందరు నమ్మకపోవచ్చు. కానీ భవిష్యత్తును ముందుగానే అంచనా వేసిన అరుదైన వ్యక్తులలో వీరబ్రహ్మేంద్ర స్వామి, నోస్ట్రడామస్ లాంటి మహానుభావులు ఉన్నారు. ఆ కోవలోకే చెందుతారు బల్గేరియాకు చెందిన బాబా వంగా. చూపు లేకపోయినా కూడా ఆమె చెప్పిన భవిష్యవాణులు చాలా వరకూ నిజమయ్యాయని కొందరు నమ్ముతున్నారు.

భారత్-పాకిస్థాన్ వార్..

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్న తరుణంలో.. ఎప్పుడు.. ఏం జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రానున్న రోజుల్లో యుద్ధం జరగవచ్చనే సంకేతాలు సైతం ఓ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు దేశాల మధ్య 2025లో ఉద్రిక్తతలు పెరుగుతాయని బాబా వంగా అంచనా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదంపై భారత్ దాడులు చేయొచ్చని, పాకిస్థాన్‌పై గట్టిగా బుద్ధి చెబుతుందని చెబుతున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోదని ఆమె స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

baba-vanga-prediction-about-india-pakisthan-war

9/11 నుంచి కరోనా వరకూ..

బాబా వంగా అనేక సంచలనాత్మక సంఘటనలను ముందుగానే ఊహించినట్లు ప్రచారం ఉంది. అందులో 9/11 దాడులు, కరోనా మహమ్మారి, బ్రెక్సిట్, ప్రిన్సెస్ డయానా మరణం, చైనా అభివృద్ధి వంటి విషయాలు ప్రముఖంగా నిలిచాయి. ఆమె మరణించిన 1996కి ముందే వీటన్నింటిని అంచనా వేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఏడాదికి సంబంధించి బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది.

ఆమె ప్రస్తావించిన అంశాల్లో.. యూరప్‌లో ఓ భారీ యుద్ధం చెలరేగే అవకాశం ఉందని.. అది మానవాళికి పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పారు. అంతే కాకుండా ఒక రకంగా మానవ జాతి పతనానికి నాంది కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె చెప్పినట్టే 2025లో ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక మాంద్యంను ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అమెరికా - చైనా ఆమధ్య టారిఫ్ వార్ నడుస్తుండడం ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు.

అంతే కాకుండా భూకంపాలు, ప్రకృతి విపత్తులు కూడా 2025లో భారీగా వస్తాయని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే మార్చి 28న మయన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రత భూకంపం, దాని వల్ల 1,700 మంది మరణం ఈ అంచనాలకు ఉదాహరణగా నిలుస్తోంది. థాయిలాండ్‌లో కూడా దాని ప్రభావం పడింది. హిమాలయాల దగ్గర వరుసగా భూకంపాలు నమోదవుతుండడం బాబా వంగా భవిష్యవాణిపై అంచనాలను పెంచుతోంది.

బాబా వంగా భవిష్యవాణిలో మరిన్ని అంశాలు..

2028లో మనుషులు శుక్ర గ్రహంపై శక్తి వనరుల కోసం వెతుకుతారని.. 2033లో ధృవాల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోతాయని.. 2076లో కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పినట్టు అంటుంటారు. అలానే 2130లో మానవులు గ్రహాంతర జీవులతో సంపర్కం కలిగి ఉంటారని.. 3005లో భూమి-మార్స్ వాసుల మధ్య యుద్ధం జరుగుతుందని.. 5079లో ప్రపంచం అంతం అవుతుందని ఆమె అంచనా వేసినట్లు కథనాలు చెబుతున్నాయి.

అయితే బాబా వంగా భవిష్యవాణులు తేదీలు, నెలల వివరాలతో చెప్పలేదన్నది ఓ వర్గం వాదన. మరి రానున్న రోజుల్లో బాబా వంగా భవిష్యవాణి నిజమో కాదో కాలమే నిర్ణయిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+