24 గంటల్లోనే వణికించిన వరుస భూకంపాలు: పరుగులు తీసిన జనం

ఖాట్మాండ్: హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం రెండుసార్లు భూకంపాలు చోటు చేసుకున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం సాయంత్రం 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేపాల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. దీంతో జనం నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

అంతకుముందు ఆదివారం ఉదయం ఖాట్మాండులో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధాడింగ్ జిల్లా జతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. ఆదివారం ఉదయం 7.39 గంటలకు ప్రకంపనలు మొదలయ్యాయి. బాగ్‌మతి, గండిక ప్రావిన్సుల్లోని ఇతర జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Back-to-back earthquakes strike Nepal on Sunday.

టిబెటన్, ఇండియన్ టెక్నోనిక్ ప్లేట్లు కలిసే శిఖరంపై ఉన్న నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రతి శతాబ్ద కాలానికి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండు మీటర్ల మేర దగ్గరకు జరుగుతున్నాయి. దీంతో లోపల ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కాగా, 2015లో నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదు కావడంతో దాదాపు 9 వేల మంది మరణించారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో నేపాల్ 11వ స్థానంలో ఉందని పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ నివేదిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+