భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్, చైనా..!

భారత్ కు సరిహద్దు దేశాలుగా ఉన్న పాకిస్థాన్, చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు రోజురోజుకూ మరింత దృఢంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే అనేక ఒప్పందాలు జరిగాయి. చైనా సాంకేతికతను అందిపుచ్చుకుని ఆసియాలోనే శక్తివంతమైన దేశంగా ఎదగాలని పాకిస్థాన్ పావులు కదుపుతోంది. ఈ మేరకు స్పేస్, డిఫెన్స్, ఎడ్యూకేషన్, మినరల్స్, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రతి రంగంలోనూ చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంది పాకిస్థాన్. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది.

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్క్వా రాష్ట్రంలోని కున్హార్ నదిపై చైనా నిర్మించ తలపెట్టిన బాలాకోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ డ్యామ్ ప్రధాన కట్టడాలను చైనా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాలాకోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మన్ సెహ్రా జిల్లాలోని బాలాకోట్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ను గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా చైనాకు చెందిన చైనా ఎనర్జీ ఇంజినీరింగ్ కార్పొరేషన్, చైనా జెన్ జౌబా గ్రూప్ థర్డ్ ఇంజినీరింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సెప్టెంబర్ 2021 లో ప్రారంభం అయింది. అయితే తాజాగా నిర్మాణ పనులు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై పఖ్తున్క్వా ఎనర్జీ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయిద్ హబీబుల్లా షా మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ స్కీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొన్నారు. నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు వివరించారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పూర్తయితే పాకిస్థాన్ లో పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ కు ప్రత్యామ్నాయంగా ఉంటుందని తెలిపారు. గ్రీన్ అండ్ లో- కార్బన్ ట్రాన్షిషన్ కు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే శక్తి వనరుల కోసం పాకిస్థాన్ ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని స్పష్టం చేశారు.

Balakot Hydro Project Enters Final Phase Chinese Expertise to Speed Up Completion

బాలాకోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు 2 వేల మందికిపైగా స్థానికులకు ఉపాధిని అందించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏటా 1.144 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ విద్యుత్ 1.88 మిలియన్ మంది ప్రజల అవసరాలను తీరుస్తుందని అంచనా వేస్తున్నారు. చైనా- పాకిస్థాన్ ఎనర్జీ కో- ఆపరేషన్ లో ఇదో కీలక ఘట్టంగా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ను భారత యంత్రాంగం పరిశీలిస్తోంది. దీనిపై భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+