సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన ప్రతిపక్ష పార్టీలు

Bangladesh elections 2024: పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆ దేశ పార్లమెంట్‌కు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 350 స్థానాలు ఉన్న ఆ దేశ పార్లమెంట్ జాతీయ సంగ్సద్ (House of Nation)కు జరిగే 12వ విడత ఎన్నికలివి.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆవామీ లీగ్ అధికారంలో ఉంది. పార్లమెంట్‌లో ఆ పార్టీకి ఉన్న సీట్ల సంఖ్య 306. ఈ పార్టీ అధినేత్రి షేక్ హసీనా ప్రస్తుతం ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీకి ఉన్న స్థానాల సంఖ్య 27. భారత్ తరహాలోనే అయిదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయక్కడ.

Bangladesh elections 2024: PM Sheikh Hasina is expected to win as the opposition boycotted the polls

ఈ సారి కూడా ఆవామీ లీగ్ అధికారంలోకి రావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఎన్నికలను ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కరించింది. షేక్ హసీనా తన బాధ్యతల నుంచి తప్పుకొని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియను తటస్థ వ్యవస్థకు అప్పగించాలనేది ఆ పార్టీ డిమాండ్. మాజీ ప్రధాని ఖలీదా జియాను విడుదల చేయాలంటూ నినదిస్తోంది. 48 గంటల జాతీయస్థాయి బంద్‌కు పిలుపునిచ్చింది.

Bangladesh elections 2024: PM Sheikh Hasina is expected to win as the opposition boycotted the polls

మొత్తంగా 11.96 కోట్ల మంది ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. వారికోసం దేశవ్యాప్తంగా 42,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆవామీ లీగ్, నేషనల్ పార్టీ సహా మొత్తంగా 27 పార్టీలు ఆ ఎన్నికల్లో పోటీ చేస్తోన్నాయి. 1,500 మంది వివిధ పార్టీల అభ్యర్థులు, 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు.

Bangladesh elections 2024: PM Sheikh Hasina is expected to win as the opposition boycotted the polls

ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పోటీలో నిలిచాడు. మగుర-1 నియోజకవర్గం నుంచి ఎన్నికల రేసులో నిల్చున్నాడు. అధికార ఆవామీ లీగ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగాడు షకీబ్. ఇదివరకు బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ముష్రఫీ మొర్తాజా రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. 14 పోలింగ్ కేంద్రాలు, రెండు స్కూళ్లను తగులబెట్టారు దుండగులు. రాజధాని ఢాకా సహా పలు చోట్ల పోలింగ్ బూత్‌లను ధ్వంసం చేసినట్లు వార్తలు వస్తోన్నాయి. బంద్ సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ..దాడులను నివారించలేకపోయాయి అక్కడి భద్రత సిబ్బంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+