బంగ్లాదేశ్‌లో చేయి దాటిన పరిస్థితి.. హిందూ దేవాలయాలపై దాడులు

హిందువులు మైనారిటీలుగా ఉన్న బంగ్లాదేశ్‌లో దేవాలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. చటోగ్రామ్‌లోని హతాఝరి సబ్‌జిల్లాలోని షికర్‌పూర్ ప్రాంతంలో, దుర్గాదేవి ఆలయంపై కొంతమంది జిహాదీ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో పాటు దుర్గాదేవి ఇతర దేవతల విగ్రహాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. హతాఝరి ప్రపంచంలోనే అతిపెద్ద మదరసాకు ఒక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది మరియు తీవ్రవాద కర్మాగారంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సమాచారాన్ని సనాతన్ ప్రభాత్ ప్రతినిధికి 'వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందువుల' సంస్థ అందించింది.

ఈ సంస్థ ఈ సమాచారాన్ని X (గతంలో ట్విట్టర్)లో ట్వీట్‌లో పోస్ట్ చేసింది.మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్‌లో సోమవారం వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని షేక్ హసీనా అధికారిక నివాసాన్ని ధ్వంసం చేశారు. ఆమె ప్రధానమంత్రిగా నిష్క్రమించిన సందర్భంగా ఆమె తండ్రి ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేసి, ఆమె పార్టీ కార్యాలయాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే వందల మంది చనిపోయారు.

Bangladesh Protests Protesters take over Parliament Indian cultural centre Hindu temples vandalised

నాలుగు రోజులుగా ఆందోళనలు సద్దుమణిగినట్లే కనిపించినా.. 2024, ఆగస్ట్ 5వ తేదీ తిరిగి మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో 300 మంది చనిపోయారు. ప్రతికూల పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం దేశం విడిచి వెళ్లనట్లు తెలుస్తోంది. ఫిన్ లాండ్ లో తలదాచుకున్నట్లు సమాచారం అందుతోంది. బంగ్లాదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా, అసాధారణ నిరసనల మధ్య తన 15 ఏళ్ల పాలనకు ముగింపు ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+