వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎంపీకి ఉరిశిక్ష ఖరారు

|
Google Oneindia TeluguNews

ఢాకా : స్వాతంత్య్రోద్యమ కాలంలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు గాను జమాతే ఇస్లామీ పార్టీ నేత, మాజీ ఎంపీ షెకావత్ హుస్సేన్(68)‌కు బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రెబ్యునుల్ బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. షెకావత్ హుస్సేన్ యుద్ధ నేరాలపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయన్ను దోషిగా తేల్చింది. షెకావత్ తో పాటు కేసుతో సంబంధమున్న మరికొందరు నిందితులకు జీవిత ఖైదు విధించింది ట్రైబ్యునల్.

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌లోనే అతిపెద్ద ముస్లిం పార్టీగా జమాతే ఇస్లామీ గుర్తింపు ఉంది. కాగా, 1971లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో జమాతే ఇస్లామీ నేతలు బంగ్లాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు సహకరించారనే అభియోగాలున్నాయి.

Bangladesh sentences ex-MP to death for war crimes in 1971

ఈ వ్యవహారంలో షెకావత్ కూడా కీలక పాత్ర పోషించారని రుజువు కావడంతో.. ఆయనకు ఉరిశిక్ష తప్పలేదు. అయితే ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు షెకావత్ తరపు న్యాయవాది ప్రకటించారు. ఇవే అభియోగాలపై ఈమధ్య కాలంలో బంగ్లాదేశ్ పలువురిని ఉరి తీసింది.

English summary
A special tribunal for war crimes during Bangladesh's independence war against Pakistan in 1971 sentenced a former lawmaker to death and seven others to life in prison on Wednesday on charges of murder and other crimes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X