Bangladesh violence:91 మంది మృతి..విద్యార్థుల డిమాండ్ ఏంటి..?
Bangladesh violence:బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు అధికార పార్టీ కార్యకర్తలకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో 91 మంది మృతి చెందగా వందలాది మందికి గాయాలయ్యాయి.దీంతో బంగ్లాదేశ్‌లో మొబైల్ ఇంటర్నెట్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బంగ్లాదేశ్‌లో భారత రాయబార కార్యాలయం కూడా అక్కడ భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఎంబెసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.తాజాగా జరిగిన ఈ ఘటనలో 72 మంది సామాన్య ప్రజలు మృతి చెందగా 14 మంది పోలీసులు మరణించారు.

సిల్హెత్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండాలని, సిల్హెత్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలని ఎక్స్ ద్వారా సూచించింది.ఈ ఘర్షణ వేళ ఎవరూ బయటకు రావొద్దని పేర్కొంది. ఇదే క్రమంలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను కూడా విడుదల చేసింది. ఎమర్జెన్సీ ఉంటే +88-01313076402 ఈ నెంబరకు ఫోన్ చేయాలని వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం ఘర్షణ చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్ చేస్తూ సహాయనిరాకరణ ఉద్యమం కోసం హాజరయ్యేందుకు నిరసనకారులు వస్తున్న సమయంలో ఘర్షణ జరిగింది.హసీనా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆమె రాజీనామా చేయాల్సిందిగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు ప్రతిపక్షపార్టీ మద్దతుదారులు.దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుశాఖ ఇచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 14 మంది పోలీసులు మృతి చెందగా 13 మంది ఒక్క సిరాజ్‌గంజ్‌లోని ఇనేత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి చెందారు.
ఇక హింసాత్మక వాతావరణం తలెత్తడంతో హోంశాఖ దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలు అయిన ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్‌లను కూడా నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటి ద్వారా పలు అవాస్తవ వార్తలు ప్రచారం జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 4జీ సేవలు నిలిపివేయాలంటూ మొబైల్ ఆపరేటర్లకు ప్రభుత్వం హుకూం జారీ చేసింది.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా విద్యార్థుల పేరుతో నిరసన చేస్తూ హింసకు పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదని వారు ఉగ్రవాదులని ప్రధాని షేక్ హసీనా అన్నారు.వారిని అణిచివేయాలంటూ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications