Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు టెక్కీ హత్య: ఎలా పట్టుబడ్డాడు, ఏం చెప్పాడు?

తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో నిందితుడైన ఆడమ్ ప్యూరిటన్ సోమవారంనాడు కోర్టులో హాజరయ్యాడు. అతను చాలా నెమ్మదిగా మాట్లాడినట్లు చెబుతున్నారు.

హ్యూస్టన్‌ :తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇరాన్ దేశస్థుడనుకుని తాను కాల్పులు జరిపినట్లు నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ కోర్టుకు చెప్పాడు. ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం అభియోగాలను ఆయనపై మోపారు.

కాల్పులు జరిపిన తర్వాత ప్యూరింటన్ 70 మైళ్ల దూరం పారిపోయాడు. క్లింటన్‌ోని ఆపిల్ బే రెస్టారెంట్‌కు వెళ్లి అటెండర్‌కు హత్య విషయం చెప్పాడు. తనమతో పాటు ఉంటానని ప్యూరింటన్ అడిగాడని, దానికి అంగీకరిస్తే ఏం జరిగిందో చెప్తానని అన్నాడని బార్ అటెండర్ తెలిపాడు.

తాము సరేనని చెప్పడంతో జరిగిందంతా చెప్పాడని అతను అన్నాడు. తాను వెంటనే 911కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్యూరింటన్‌ను అరెస్టు చేసినట్లు అతను తెలిపాడు. ప్యూరింటన్ కోరిక మేరకు అతడి తరఫున వాదించేందుకు న్యాయవాదిని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జి నియమించారు. రెండు మిలియన్ డాలర్ల బాండుతో అతన్ని జైలుకు పంపించారు. ఐదు నిమిషాల్లో విచారణ ముగిసింది.

Bar patron charged in shootings of 2 Indian men appears in court

అమెరికాలో గల కాన్సస్‌లోని ఓ పబ్‌లో జాత్యహంకార దాడికి పాల్పడిన 51 ఏళ్ల నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ సోమవారంనాడు కోర్టుకు హాజరయ్యాడు. అతను జరిపిన కాల్పుల్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా, మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.

అమెరికా నావికాదళ మాజీ అధికారి అయిన ప్యూరింటన్‌‌ను తొలిసారిగా పోలీసులు సోమవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని కోర్టులో హాజరు పరిచారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఏ మాత్రం తొణకకుండా ప్యూరింటన్ సమాధానమిచ్చాడని తెలుస్తోంది.

ప్యూరింటన్ జాత్యహంకార నేరానికి పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో రుజువైతే ఆయనకు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గత బుధవారంనాడు ఓలెత్‌లోని బార్‌లో ప్యూరింటన్ 'మా దేశం విడిచి వెళ్లిపోండి' అని గట్టిగా అరుస్తూ తెలుగు యువకులపై కాల్పులు ఆయన జరిపినట్లు చెబుతున్నారు.

ఈ దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడినవారిలో తెలుగు టెక్కీ ఆలోక్ ఉన్నాడు. కాల్పులు అనంతరం అక్కడి నుంచి మాయమైన ప్యూరింటన్‌ను వెస్ట్ సెంట్రల్ మిస్సౌరీలోని హెన్రీ కౌంటీలో అరెస్టు చేశారు.

ఫస్ట్ డిగ్రీ మర్డర్‌, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. జాన్సన్ కౌంటీ జైలులో ప్రస్తుతం ఆయనను ఉంచారు. కాగా, ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరణకు ఎఫ్‌బీఐ సహకరిస్తోంది. తిరిగి ఈ నెల 9వ తేదీన అతను కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+