ఒబామా కూతుళ్ల కిడ్నాప్ యత్నం?: వైట్‌హౌజ్ మూత!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం మంగళవారం ఒక గంటపాటు మూసివేయబడింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతుళ్లు వెళుతున్న కారును వెంబడించిన ఓ వాహనాన్ని భద్రతా సిబ్బంది అడ్డగించారు. అనంతరం ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మంగళవారం సాయంత్రం ఈ సంఘటన వైట్ హౌజ్‌లో చోటు చేసుకుంది. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. కారు నడిపిన వ్యక్తిని మాథ్యూ ఈవన్ గోల్డ్‌స్టెయిన్(55)గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతడు అనుమతి లేకుండా వైట్‌హౌజ్‌లోకి ప్రవేశించిన కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే అతని హోంటౌన్ గురించిన వివరాలు తెలుపలేదు.

Barack Obama's daughters followed, White House locked down for 1 hour

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కథనం ప్రకారం.. ఒబామా కూతుళ్లు ప్రయాణిస్తున్న కారును అనుమాతుడు వైట్‌హౌజ్‌ వరకూ వెంబడించాడని తెలిపారు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమీపంలోకి రాగానే ఆ వాహనాన్ని ఆపివేసినట్లు చెప్పారు.

కాగా, కొలంబియా జిల్లా పోలీసులు పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఓ వాహనాన్ని పట్టుకున్నారు. ఇది వైట్‌‌హౌజ్ వాయవ్య గేట్‌కు ఫీట్‌ దూరంలోనే కావడం గమనార్హం. దీంతో పెన్సెల్వేనియా ఎవెన్యూ, వైట్ హౌజ్ కాంప్లెక్స్ గంటపాటు మూసివేసి అనంతరం పునరుద్ధరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+