ఐఎస్ఐఎస్ కు ఒబామా సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద నాయకులను అంతం చేసే వరకు నిద్రపోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. వారు ఎక్కడ తలదాచుకున్నా మా నుంచి తప్పించుకోలేరని అన్నారు.
సిరియా, ఇరాక్ దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ నాయకులు ఎక్కడున్నా వారిని హతమార్చుతామని చెప్పారు. కాలిఫోర్నియాలో ఉగ్రవాద దంపతులు కాల్పులు జరిపి 14 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ సంఘటన తరువాత బరాక్ ఒబామా రెండవ సారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హెచ్చరించారు. వైట్ హౌస్ లో అమెరికా మిలటరీ అధికారులతో చర్చించిన తరువాత ఒబామా అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఈ సందర్బంలో ఉగ్రవాదులకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు.

తమ తదుపరి లక్ష్యం మీరే, సిరియా, ఇరాక్ దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను నామరూపాలులేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను నిర్మూలించడానికి అమెరికా, మిత్రదేశాలతో కలిసికట్టుగా పోరాడుతాయని అన్నారు.
మేము ఇస్లామిక్ స్టేట్ నాయకులకు పంపే సందేశం ఒక్కటే. మా లక్ష్యం మీరే, మిమ్మల్ని సర్వనాశనం చేసే వరకు అమెరికా నిద్రపోదని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రపంచ దేశాల ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్నారని, ఇక చూస్తూ ఉండమని బరాక్ ఒబామా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications