బెనజీర్ హత్య కేసులో ముషారఫ్‌ను దోషిగా తేల్చిన ఏటీసీ కోర్టు
బెనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను యాంటీ టెర్రరిజమ్ కోర్టు(ఏటీసీ) దోషిగా తేల్చింది.
ఇస్లామాబాద్: బెనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను యాంటీ టెర్రరిజమ్ కోర్టు(ఏటీసీ) దోషిగా తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
కాగా, దోషిగా తేల్చిన ముషారఫ్ ఇప్పుడు పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. అంతేగాక, దేశంలోని ముషారఫ్ కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

కాగా, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత్రిగా భుట్టో రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. అయితే, డిసెంబర్ 27, 2007న రావల్పిండి లియాఖత్ బాగ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న భుట్టోను ఆత్మాహుతి దాడి చేసి హత్య చేశారు.












Click it and Unblock the Notifications