Sri Lanka : రాజపక్సలకు భారీ షాక్-దేశం దాటి వెళ్లకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు..
శ్రీలంక అధ్వాన్వ స్ధితికి దిగజార్చిన రాజపక్స సోదరులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. రాజపక్స సోదరులు గోటబాట, మహింద, చామల్, నమల్ రాజపక్సలు ప్రభుత్వంలో అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులుగా కీలక పాత్ర పోషించి దేశాన్ని ఈ స్ధితికి తెచ్చారని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాగ్రహాన్ని గమనించిన వీరు ఒక్కొక్కరిగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. అయినా ప్రజలు శాంతించక పోవడంతో ఏకంగా దేశం నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిని అడ్డుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
దేశాన్ని దివాళా తీయించి ఇప్పుడు దేశాన్ని వదిలి విదేశాలకు పారిపోతున్న రాజపక్స సోదరులపై ప్రజాగ్రహం నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన శ్రీలంక సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. రాజపక్స సోదరుల్ని దేశం విడిచి వెళ్లిపోకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశం విడిచి సింగపూర్ వెళ్లిపోయారు. అయితే మరో ఇద్దరు సోదరులు మహీంద, బాసిల్ రాజపక్స కూడా ఇదే బాటలో ఉన్నట్లు తేలింది. దీంతో వీరిద్దరూ దేశం దాటిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

నిన్నటి నుంచి గోటాబయ చట్టబద్ధంగా రాజీనామా చేసారని స్పీకర్ మహింద యాపా అబేవర్దన ఇవాళ విలేకరులతో వెల్లడించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 20వ తేదీ బుధవారం పార్లమెంటు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోనుందని ఒక అధికారి తెలిపారు. నిరసనకారులు ఈరోజు కూడా గత శనివారం ఆక్రమించుకున్న రాష్ట్రపతి భవనాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. ఫోరెన్సిక్ బృందం వెంటనే వచ్చి వేలిముద్రలను సేకరించడం ప్రారంభించింది. అలాగే నష్టం స్థాయిని అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications