వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. రష్యాకు బాసటగా నిలవాలని సందేశాలు

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతా పార్టీకి ఊహించని పరిణామాణం ఎదురైంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. సైబర్ కేటుగాళ్లు నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు ప్రాథమికంగా నిర్థారణ అయింది. సైబర్ నేర‌గాళ్లు ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న ముద్ధం గురించి కూడా ప్రస్తావించారు.. రష్యా ప్రజలకు మద్దతు ఇవ్వాలన్నారు. క్రిఫ్టోకరెన్సీ, బిట్ కాయిన్స్‌పై కూడా ట్విట్ చేశారు.

జేపీ న‌డ్డా ట్విట్ట‌ర్ ఖాతాలో బిట్‌కాయిన్ లింకులు

సైబర్ కేటుగాళ్లు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాలో ఈ ట్విట్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బిట్ కాయిన్, ఇథేరియం, క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన లింకులను కూడా ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. ప్రజల కోసం తాము ఈ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ట్విట్ పెట్టారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయ సిబ్బంది వెంటనే గ్రహించారు. హ్యాక్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. కొంత సేపు తర్వాత జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను రీస్టోర్ చేశారు.

BJP Chief Jp Nadda Twitter Account hacked and seeked funds

భద్రతా మండలిలో తీర్మానం ఓటింగ్‌కు భార‌త్ ధూరం

Recommended Video

Russia Ukraine Conflict : Ukraine Rejects US Offer | Volodymyr Zelenskyy | Oneindia Telugu

ఇదిలా ఉండగా .. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా , అల్బేనియా కలిసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. భారత్ , చైనా, యూఏఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురవడం చర్చనీయాంశమైంది.

English summary
JP Nadda twitter account hacked and demand funds for Russia ..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X