ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..!
ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్ (iran)పై ఏకపక్షంగా యుద్దం ప్రారంభించిన అమెరికా(US)కు దాన్ని ఎలా ముగించాలో తెలియడం లేదు. ఓవైపు పెరిగిపోతున్న చమురు ధరలు, కుప్పకూలుతున్న మార్కెట్లు ఆర్దిక వ్యవస్దలు, మరోవైపు త్వరగా యుద్దం ముగించాలన్న ఒత్తిడి మధ్య నలిగిపోతున్న ట్రంప్ (donald trump)పై ఆయన స్వదేశంలో అమెరికాలో సీఐఏ మాజీ బాస్ మరో బాంబు పేల్చారు. ట్రంప్ ఎంతటి విపత్కర పరిస్ధితుల్లో చిక్కుకుపోయారో ఆయన వివరించారు.
ఇరాన్ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్ధితి అంత క్షిష్టంగా మారుతుందని సీఐఏ మాజీ బాస్ లియోన్ పనెట్టా వెల్లడించారు. అమెరికా మాజీ రక్షణ మంత్రి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ అయిన లియోన్ పనెట్టా.. వారాల తరబడి సాగుతున్న ఈ యుద్ధం తర్వాత ట్రంప్ "ముందు నుయ్యి, వెనుక గొయ్యి" మధ్య చిక్కుకున్నారని అన్నారు.'ది గార్డియన్'తో మాట్లాడుతూ మధ్యప్రాచ్య సంక్షోభానికి ఆయనే కారణమని అన్నారు. ఇది ఊహించని ప్రమాదం కాదన్నారు.

హార్ముజ్ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలిగించగలదని అమెరికా భద్రతా అధికారులకు చాలా సంవత్సరాలుగా తెలుసని, కానీ గతంలో పదేపదే హెచ్చరించినప్పటికీ, ప్రస్తుత యుద్ధంలో దీనిని విస్మరించినట్లు కనిపిస్తోందన్నారు. ఇరాన్‌తో యుద్ధం చేయబోతున్నట్లయితే హార్ముజ్ జలసంధి మీ అతిపెద్ద బలహీనతలలో ఒకటి అని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రస్తుత పరిస్థితి స్పష్టమైన సన్నద్ధత లోపాన్ని చూపిస్తోందన్నారు. ప్రభుత్వం ఇరాన్ ప్రతిస్పందనను తక్కువ అంచనా వేసిందని లేదా ఈ సంఘర్షణ త్వరగా ముగుస్తుందని భావించిందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ దీనికి సిద్ధంగా లేరని, ఇప్పుడు దాని మూల్యం చెల్లిస్తున్నారని విమర్శించారు.

ఇరాన్ వార్ పర్యవసానాలు ఇప్పుడు కేవలం మధ్యప్రాచ్యంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లలోనూ ప్రభావం చూపుతున్నాయని ఆయన హెచ్చరించారు.తొలి సైనిక చర్య ఫలితాన్ని ప్రశ్నిస్తూ.. అమెరికా ఆశించిన విధంగా అది ఇరాన్‌ను బలహీనపరచలేదని తేల్చేశారు. దానికి బదులుగా ఇరాన్ నాయకత్వం మరింత పాతుకుపోయినట్లు కనిపిస్తోందని, ఇప్పుడు కొత్త, మరింత కఠినమైన వ్యక్తి మొజ్తబా ఖమేనీ అధికారంలో ఉన్నారని వెల్లడించారు. ట్రంప్ చాలా కఠినమైన సమస్యను ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు దేన్ని ఎంచుకున్నా తీవ్ర పరిణామాలు లేకుండా ఉండవని ఆయన తేల్చేశారు. యుద్ధం నుండి వైదొలగడం వైఫల్యంగా పరిగణించబడవచ్చని, అదే సమయంలో సంఘర్షణను విస్తరించడం పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం నెలకున్న పరిస్థితికి డొనాల్డ్ ట్రంప్ తప్ప మరెవరూ బాధ్యులు కారని స్పష్టం చేశారు. మిత్రదేశాలతోనూ ట్రంప్ వైఖరి బాగోలేదన్నారు.
-
స్వయానా ట్రంప్ నోట -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!












Click it and Unblock the Notifications