సౌదీ అరేబియా ఎయిర్‌పోర్ట్‌పై బాంబుల వర్షం: ఎవరి పని?: ఆఫ్ఘన్ ఎఫెక్ట్ అంటూ అనుమానాలు
రియాద్: భారతీయులు వేలసంఖ్యలో నివసించే సౌదీ అరేబియాలోని కీలక విమానాశ్రయంపై బాంబుల వర్షం కురిసింది. గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో అటాక్ చేశారు. డ్రోన్ల ద్వారా విమానాశ్రయంపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. పలువురికి గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి ఉంచిన కొన్ని విమానాలు దెబ్బతిన్నాయి. పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నామంటూ ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ గానీ, టెర్రరిస్టులు గానీ ప్రకటించుకోలేదు.
సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని అభా విమానాశ్రయంపై ఈ డ్రోన్ల దాడి చోటు చేసుకుంది. ఒకేరోజు రెండుసార్లు బాంబు దాడులు చోటు చేసుకున్నాయి ఈ ఎయిర్‌పోర్ట్‌పై. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు అభా విమానాశ్రయంపై బాంబుదాడులు సంభవించినట్లు సౌదీ అరేబియా అధికారిక టెలివిజన్ వెల్లడించింది. పొరుగునే ఉన్న యెమెన్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, యుద్ధ వాతావరణం ప్రభావం వల్లే ఈ దాడి చోటు చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత.. ఉగ్రవాద సంస్థలు క్రమంగా క్రియాశీలకమౌతోన్నాయనే అంచనాలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల మధ్య యెమెన్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటోన్నాయి. యెమెన్ మిలటరీ బేస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు వరుస దాడులు చేశారు. మిస్సైళ్లను సంధించారు. ఈ దాడుల్లో 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. హౌతీ ఈ దాడులకు పాల్పడిందనే అనుమానాలు ఉన్నాయి.
లహిజ్‌లోని మిలటరీ బేస్ స్టేషన్‌పై జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. అయినప్పటికీ- హౌతీ తిరుగుబాటుదారులు దీనికి కారణమంటూ వార్తలు వెలువడ్డాయి. యెమెన్ సరిహద్దులకు అతి సమీపంలో ఉండటం వల్ల హౌతీ తిరుగుబాటుదారులే అభా విమానాశ్రయంపై డ్రోన్లతో బాంబుదాడులకు పూనుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. యెమెన్ సైనిక బలగాలకు సౌదీ అరేబియా అండగా ఉంటోందని, ఈ కారణంతోనే తిరుగుబాటుదారులు ఈ దాడికి పూనుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
2014 నుంచి హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తోన్నారు. తరచూ దాడులకు పాల్పడుతూ ఓ యుద్ధాన్నే సాగిస్తూ వస్తోన్నారు. ఆప్ఘనిస్తాన్‌లో ఇదివరకు తాలిబన్లు అమెరికా, నాటో సారథ్యంలోని సైన్యంపై దాడులు చేసినట్లుగానే యెమెన్‌లో అదే తరహా వాతావరణాన్ని సృష్టించారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత.. హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ చెలరేగిపోతోన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తిరుగుబాటుదారులను అణచివేయడానికి యెమెన్ ప్రభుత్వానికి, సైనిక బలగాలకు సౌదీ అరేబియా తనవంతు సహకారాన్ని అందిస్తూ వస్తోంది. సౌదీ అరేబియా సంకీర్ణ సైనిక బలగాలు యెమెన్‌లోనే ఉంటూ హౌతీ తిరుగుబాటుదారుల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోన్నాయి. దీనికి ప్రతీకారంగా యెమెన్ తిరుగుబాటుదారులే.. సరిహద్దులకు ఆనుకుని ఉన్న అభా విమానాశ్రయంపై బాంబుదాడికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications