
తెరపైకి బోరిస్ జాన్సన్ పేరు..? మాజీ ప్రధానికే పట్టం: రిపోర్ట్
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. మరీ ఆమె వారసురాలు ఎవరు..? ముందు వరసలో ఎవరూ ఉన్నారనే చర్చ జరుగుతుంది. రకరకాల అంచనాల మధ్య కొత్తగా తెరపైకి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. జాన్సన్ అభ్యర్థిత్వం పరిశీలనలో ఉందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. జాన్సన్ ఈ ఏడాది తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ ఉల్లంఘనలు, ఇతర ఆరోపణలతో ఆయన రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ట్రస్ బాధ్యతలను తీసుకున్నారు.
అందుకే జాన్సన్ అట..
జాన్సన్ పేరు పరిశీలనలో ఉండగా.. అదీ జాతి ప్రయోజనాల కోసమేనని టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ స్టివెన్ స్విన్ ఫొర్డ్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవీకి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అన్నీ వర్గాలు పెదవి విరిచాయి. ఆమె నాయకత్వంపై సందేహం వెలిబుచ్చాయి. అన్నీ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. సొంత పార్టీ కూడా విశ్వసించని పరిస్థితి నెలకొంది. ఇటీవల ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఘోరంగా విఫలమైంది. పన్నుకోతలతో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని ఎన్నికల ప్రచార సమయంలో రిషి సునాక్ హెచ్చరించారు. ఆయన చెప్పినట్టే జరిగింది.

6 వారాలకే రాజీనామా
పదవీ చేపట్టిన ఆరు వారాల తర్వాత ట్రస్ రాజీనామా చేశారు. తన వారసుడు వచ్చేవరకు పదవీలో కొనసాగుతానని స్పష్టంచేశారు. ట్రస్ రిజైన్ చేశారో లేదో.. బ్రిటన్ లేబర్ పార్టీ నేత కిర్ స్టార్మర్ మాత్రం జనరల్ ఎలక్షన్స్ నిర్వహించాలని కోరారు. జాన్సన్ పేరు తెరపైకి వచ్చినా.. రిషి సునాక్ పేరు మాత్రం ముందు వరసలో ఉంది. అతని నాయకత్వాన్ని సొంత పార్టీ కొరుకుంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. సునాక్ పేరు మార్పు ఉండదని కొందరు అంటున్నారు.