రూ.1.25 కోట్లు దొరికితే, తిరిగిచ్చిన ట్యాక్సీ డ్రైవర్

Posted By:
Subscribe to Oneindia Telugu

బోస్టన్: అమెరికాలోని బోస్టన్‌లో ఓ ట్యాక్సీ డ్రైవర్ తన ట్యాక్సీలో ప్రయాణీకులు మరిచిపోయిన 187 వేల డాలర్లను తిరిగి అప్పగించారు. ఆయన నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు. ఇది సదరు డ్రైవర్‌ను హీరోను చేసింది.

బోస్టన్ నగరంలో ఓ ప్రయాణికుడు నార్తర్న్ యూనివర్సిటీకి వెళ్లాలంటూ ఓ టాక్సీని మాట్లాడుకున్నాడు. యూనివర్సిటీ వద్ద దిగిన ప్రయాణికుడు యూనివర్సిటీలోకి వెళ్లే హడావుడిలో ట్యాక్సీలోనే తన బ్యాగును మరిచిపోయాడు.

Boston Cab Driver Returns $187K in Cash Left Behind by Passenger, Police Say

తన ట్యాక్సీని మళ్లించి వెనక్కి వస్తున్న సదరు డ్రైవర్.. వెనుక సీట్లో ఆ బ్యాగును గుర్తించాడు. ఆ బ్యాగులో 1.87 లక్షల డాలర్లు (దాదాపు 1.25 కోట్ల రూపాయలు) ఉన్నాయి. దీంతో, అతను తన టాక్సీని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ మొత్తాన్ని వారికి అప్పగించాడు. ఆ తర్వాత కాసేటికే డబ్బులు మర్చిపోయిన ప్రయాణీకుడు వచ్చాడు. సదరు డ్రైవర్‌ను అందరీ ప్రశంసించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Boston Cab Driver Returns $187K in Cash Left Behind by Passenger, Police Say.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి