అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్.. పరిస్థితి విషమం.. ట్రంప్ ఎమోషనల్ ట్వీట్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయన "అగ్రెసీవ్ ప్రోస్టేట్ క్యాన్సర్" బారిన పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ మేరకు డెమొక్రాట్స్ ఆఫీస్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. బైడెన్ కు క్యాన్సర్ స్టేజీ 9(గ్రేడ్ గ్రూప్ 5)గా ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. క్యాన్సర్ ఆయన శరీరంలోని ఎముకలకు వ్యాపించిందని వైద్యులు ధృవీకరించారు. ఇది ఆందోళన కలిగించే విషయం అని అభిప్రాయపడ్డారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని డెమోక్రాట్స్ ఓ పత్రికా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. ప్రోస్టేట్ క్యాన్సర్ స్టేజీ 9 గా ఉందని.. ఎముకలకు వ్యాప్తించినట్లు పేర్కొన్నారు. మూత్రాశయంలో ఇబ్బంది కారణంగా పరీక్షలు చేయించుకోగా ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం బైడెన్ ఫ్యామిలీ ట్రీట్ మెంట్ పై సమీక్ష జరుపుతోందని డెమోక్రాట్స్ తెలిపారు.
అయితే జో బైడెన్ కుమారుడు బియూ బైడెన్ సైతం 2015లో క్యాన్సర్ తో మృతి చెందారు. ఇక బైడెన్ క్యాన్సర్ స్టేజీ 9 గా ఉంది. సాధారణంగా లెవెల్ 5 దాటితేనే అబ్ నార్మల్ గా వైద్యులు భావిస్తారు. కానీ బైడెన్ కు 9 ఉంది. 10 వరకు స్టేజీలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ట్రంప్ షాక్..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడటంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ఆ వార్త తనను బాధించిందని పేర్కొన్నారు. జో బైడెన్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలన్నారు. ఆయన విజయవంతంగా క్యాన్సర్ ను అధిగమిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ట్రంప్.
ఇక ప్రోస్టేట్ క్యాన్సర్ మగవారికి వస్తుంది. ఇది మగవారిలో సాధారణంగా వచ్చే క్యాన్సర్. అమెరికాలో జరిపిన ఓ అధ్యయనంలో అక్కడ ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడినట్లు కథనాలు వస్తున్నాయి. తొలి దశలో గుర్తిస్తే ప్రాణాలకు ప్రమాదం లేదట.












Click it and Unblock the Notifications