ఉత్తరకొరియాతో యుద్ధం: అమెరికాకి తోడుగా బ్రిటన్! రంగంలోకి క్వీన్ ఎలిజబెత్?
అమెరికా మిత్ర దేశమైన బ్రిటన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన యుద్ధ సామగ్రిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
లండన్: ఉత్తరకొరియా, అమెరికాల మధ్య వార్ టెన్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా మిత్ర దేశమైన బ్రిటన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన యుద్ధ సామగ్రిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మాటల యుద్ధానికి తెరపడడం లేదు. దీంతో ఇరు దేశాల నడుమ యుద్ధం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకవేళ ఉత్తరకొరియా.. అమెరికాతో గనుక తలపడితే.. ఇరువైపులా ఉన్న మిత్రదేశాలు చూస్తూ ఊరుకోవు. యుద్ధంలోకి అవి దిగక తప్పదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ముందు జాగ్రత్త చర్యగా తన ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకుంటోంది.
బ్రిటన్ తన సరికొత్త విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ ను రంగంలోకి దించనుంది. తమ వద్ద టైప్ 45 డెస్ట్రాయర్లు, టైప్ 23 ఫ్రిగేట్స్ ఉన్నప్పటికీ.. అవసరమైతే విమాన వాహక నౌక క్వీన్ ఎలిజబెత్ ను కూడా రంగంలోకి దించుతామని ఆ దేశ మిలటరీ అధికారి ఒకరు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications