వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రలో తొలిసారి: జీతాలు పెంచాలంటూ బ్రిటిష్ రాణి సిబ్బంది సమ్మె

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ దేశపు రాణి ఎలిజబెత్ II నివాసం విండ్ సర్ క్యాజిల్‌లో పని చేసే స్టాఫ్ జీతాలు పెంచకుంటే ఇండస్ట్రియల్ యాక్షన్ తీసుకుంటామని సోమవారం హెచ్చరించారు. అంతే కాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పబ్లిక్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ యూనియన్ (పీసీఎస్) తెలిపింది.

వెస్ట్ లండన్‌లో ఉన్న ఈ అందమైన భవంతిలో సుమారు 200 మంది పనిచేస్తున్నారు. ఈ భవంతి 900 ఏళ్ల కాలం నాటిది. తమకు ఏడాదికి కేవలం 14,400 పౌండ్లు (రూ 13.35 లక్షలు) చెల్లిస్తున్నారని, అవి తమకు కనీస అవసరాలకు కూడా సరిపోడవం లేదని, ఎలాగైనా సరే వాటిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Britain's Queen Elizabeth II faces prospect of first-ever staff strike

పబ్లిక్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ యూనియన్ (పీసీఎస్) ద్వారా తమ భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నారు. వీరిలో సుమారు 120 మంది ఎలిజబెత్ II వ్వవహారి శైలిపై కూడా విమర్శలు చేశారు. అదనంగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి చెల్లింపులు చేయడం లేదని, వచ్చిన అతిధులకు రాయల్ ట్రీట్‌మెంట్ చేసేది వీరేనని పీసీఎస్ జనరల్ సెక్రటరీ మార్క్ సెర్‌వోట్కా పేర్కొన్నారు.

విండ్ సర్ క్యాజిల్‌లో పనిచేసే మొత్తం 200 మంది ఉద్యోగుల్లో 120 మంది వరకు ఏప్రిల్ 14న ఇండస్ట్రీయల్ యాక్షన్‌ తీసుకునేందుకు బ్యాలెట్ ఓటింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా ఎలిజబెత్ II వారాంతపు సెలవుల్లో విండ్ సర్ క్యాజిల్‌‌లో సేదతీరుతుంటారు.

English summary
Staff at Queen Elizabeth II's Windsor Castle are threatening to take industrial action over pay, a trade union said Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X