వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా జర్నలిస్ట్‌ తొడలపై అసభ్యంగా: కార్యదర్శి పదవికి రాజీనామా చేసి ఫాల్లోన్

లైంగిక వేధింపులు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. తమపై చోటుచేసుకొన్న లైంగిక వేధింపుల విషయమై బాధితులు బయట పెడుతుండడంతో వాస్తవాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: లైంగిక వేధింపులు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. తమపై చోటుచేసుకొన్న లైంగిక వేధింపుల విషయమై బాధితులు బయట పెడుతుండడంతో వాస్తవాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి.అయితే వాస్తవాలు వెలుగులోకి రావడంతో నిందితులు తమ తప్పును ఒప్పుకొంటున్నారు. ఇదే తరహ ఘటన ఒకటి బ్రిటన్‌లో చోటుచేసుకొంది.

బ్రిటీష్‌ రక్షణ కార్యదర్శి మైకేల్ ఫాల్లొన్‌ పేరు కూడా లైంగిక వేధింపుల్లో ఉన్నట్టు బయటకు వచ్చింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. అయితే గతంలో తాను మహిళలను వేధించిన మాట వాస్తవమేనని ఆయన తప్పు అంగీకరించారు.

British Defense Secretary Michael Fallon resigns after allegations of inappropriate sexual behavior

బుధవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి థెరిసా మే కు పంపించారు. ప్రస్తుత ఆరోపణలను ఖండించారు. కానీ, తాజాగా తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

గతంలో మాత్రం తాను కొన్ని తప్పులు చేశానంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎంపీగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు ప్రకటించారు. కాగా, ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కొని ఉన్నత పదవికి రాజీనామా చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా మైకేల్‌ ఫాల్లొన్‌ నిలిచారు.

ఫాల్టోన్ రాజీనామా నిర్ణయాన్ని ప్రధాని థెరిసా మే ప్రశంసించారు. విచారణలో నిజాలు బయటపడతాయని ప్రధాని పేర్కొన్నారు. 2002 లో జులియా హర్ట్‌లే-బ్రూవర్‌ అనే మహిళా జర్నలిస్ట్ తొడల మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఫాల్లొన్‌పై వినిపించాయి. ఈ ఘటనపై గత వారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫాల్లొన్ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ మధ్య ఆయనపై మళ్లీ లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వాటిని ఖండించిన ఆయన గతంలో మాత్రం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించానని చెప్పారు.

15 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పటంపై జులియా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతని రాజీనామాను ఓ మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. రాజీనామా వెనుక అనుమానాలు వ్యక్తం చేశారామె.

English summary
Britain’s defense secretary Michael Fallon abruptly resigned Wednesday following allegations of inappropriate sexual behavior.Fallon, 65, is the first British lawmaker to resign amid a growing number of claims against British politicians that have emerged in the wake of the Harvey Weinstein scandal, which has encouraged people around the world to share their stories about sexual harassment and assault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X