వేళ్లను నరికి, తీవ్రంగా కొడుతూ ముగ్గురు యువతుల హత్య.. సోషల్ మీడియాలో లైవ్ !!!
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ముగ్గురు యువతులను దారుణంగా చిత్రహింసలకు గురిచేసి.. హత్య చేయడమే కాకుండా ఆ ఘోరాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే.. ?
బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన మోరెనా వెర్డి (20), బ్రెండా డెల్ కాస్టిల్లో (20), లారా గుటియెర్రెజ్ (15) ఈ నెల 19న అదృశ్యమయ్యారు. ఐదు రోజుల పాటు ఎటువంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఓ ఇంటి వెనుకభాగంలో మట్టిలో పాతిపెట్టబడ్డ వారి మృతదేహాలను కనుగొనడంతో అందరూ షాక్ కి గురయ్యారు.

ప్రాథమిక విచారణలో ఈ హత్యలకు డ్రగ్స్ మాఫియా విభేదాలే కారణం అని పోలీసులు నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను ఒక వ్యాన్‌లోకి ఎక్కించి, అనంతరం అమానుషంగా హత్య చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరు ఈ హత్యను ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు బయటపడింది. సుమారు 45 మంది ఈ లైవ్‌ను వీక్షించినట్లు అధికారులు తెలిపారు. తన దగ్గర డ్రగ్స్ దొంగిలిస్తే ఇలాగే జరుగుతుంది" అంటూ ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్లు సమాచారం.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నిందితులు బాధితుల వేళ్లను నరికి, గోళ్లను పీకి, తీవ్రంగా కొట్టి, ఊపిరాడకుండా చేసి చంపారు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆగ్రహం ఉద్ధృతమైంది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జాతీయ భద్రతా మంత్రి పాట్రిసియా బుల్రిచ్ తెలిపారు. ఐదో నిందితుడిని బొలీవియా సరిహద్దు నగర విల్లాజోన్లో పట్టుకున్నట్లు చెప్పారు. ప్రధాన సూత్రధారి అయిన 20 ఏళ్ల పెరూ దేశస్థుడి కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.

లైవ్ స్ట్రీమింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిందనే ఆరోపణలపై మెటా స్పందించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటనతో అర్జెంటీనాలోని డ్రగ్ మాఫియా గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications