మహారాణి కోహినూర్ వజ్రం దక్కేదెవరికి - ఎలిజబెత్ ఏం కోరుకున్నారు..!!

మహారాణి ఎలిజబెత్‌-2(96) కన్నుమూశారు. బ్రిటన్ ను దాదాపు ఏడు దశాబ్దాల పాటు పాలించిన మహారాణి మరణంతో ఇప్పుడు ఆమె పెద్దకుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ నూతన రాజుగా, 14 కామన్వెల్త్‌ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. ఇదే సమయంలో ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలోని ఈ వజ్రం ఇప్పుడు ఎవరికి వెళ్తుందనే ఆసక్తి కర చర్చ మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు చార్లెస్ సతీమణి కెమిల్లా(డచెస్‌ ఆఫ్ కార్న్‌వాల్‌)కు రాణి హోదా దక్కనుందని తెలుస్తోంది. ఇదే జరిగితే కొహినూర్ వజ్రంతో పొదిగిన ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు అధికారికంగా దక్కుతుంది.

గతంలో బ్రిటన్ సమావేశాల సమయంలో రాణి ఇచ్చిన సందేశంలో తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి కావాలని ఆకాంక్షించారు. బ్రిటన్ రాజ కుటుంబ సంప్రదాయం ప్రకారం తదుపరి రాణికే ఈ కిరీటం దక్కనుంది. ఈ కిరీటానికి మరో ప్రత్యేకత ఉంది. 1937లో కింగ్ జార్జ్‌-6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్‌ ఉంది. ఎలిజబత్ రాణి మరణంతో ఆ కోహినూర్ తో ఉన్న కిరీటం కెమిల్లా సొం కానుంది. ఈ కోహినూర్ 105.6 కేరట్ల వజ్రంగా చెబుతారు. ఈ వజ్రాన్ని 14వ శతాబ్దంలోనే భారత్ లో గుర్తించారు. ఆ తరువాత అనేక చేతులు మారింది. 1849 లో బ్రిటిష్ పంజాబ్ ను ఆక్రమించిన తరువాత ఆ వజ్రం విక్టోరియా రాణి వద్దకు చేరింది

Camilla will receive the Queen Mothers famous Kohinoor crown, as per reports

దీనికి సబంధించి భారత్‌తో సహా దాదాపు నాలుగు దేశాల్లో దీనిపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు వారసత్వంగా రాణి హోదాగా ఉన్న వారికి ఇది దక్కాలి. కానీ, చార్లెస్‌ తొలుత ప్రిన్స్‌ డయానాను వివాహమాడారు. 1996లో వారు విడాకులు తీసుకున్నాక ఏడాదికే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కెమిల్లా రెండో భార్య. దీంతో..కెమిల్లాకు రాణి హోదాపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీటన్నింటినీ పక్కనబెట్టి తన కోడలు కెమిల్లాకు రాణి హోదా రావాలని ఎలిజబెత్‌-2 అప్పట్లోనే ఆకాంక్షించారు. దీంతో..ఇప్పుడు ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు అధికారికంగా దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+