వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు మిలియన్ల కొద్దీ డాలర్ల సాయం: కెనడా మంత్రి కరీనా: ఫండింగ్ రెడ్‌క్రాస్‌కే

|
Google Oneindia TeluguNews

ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు దేశంలో కల్లోలాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,293. ఇదివరకెప్పుడూ ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక ఊపిరి వదులుతున్నారు. యాక్టివ్ కేసులు 30 లక్షలకు చేరువ అయ్యాయి.

ఈ పరిస్థితులు ప్రపంచ దేశాలను కదిలిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత్‌ను ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆక్సిజన్ జనరేటర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలు, ప్రాణవాయువును తయారు చేసుకోవడానికి అవసరమైన యంత్రాలు, వాటి విడి భాగాలను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. భారత్‌కు 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తక్షణ సహాయం కింద ఈ మొత్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందిస్తామని తెలిపింది.

Canada announces $10 million in funding to Indian Red Cross Society

ఈ మేరకు కెనడా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి కరీనా గౌల్డ్ ఓ ప్రకటన చేశారు. తాము ప్రకటించిన ఆర్థిక సహాయం ఒకేసారి కెనడియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి ఏకమొత్తంలో బదిలీ చేస్తామని తెలిపారు. కెనడియన్ రెడ్‌క్రాస్ ద్వారా భారత రెడ్‌క్రాస్ ఆ మొత్తం అందుతుందని చెప్పారు. మానవతాదృక్పథం కింద భారత్‌కు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆదేశాల మేరకు అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మొత్తంతో అంబులెన్సులు, పీపీఈ కిట్లను కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నట్లు కరీనా గౌల్డ్ పేర్కొన్నారు.

ఆర్థిక సహాయంతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్లు, ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులను భారత్‌కు పంపిస్తామని చెప్పారు. తమ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ గార్న్యూ, భారత కౌంటర్ పార్ట్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌ మధ్య సాగిన అత్యున్నత స్థాయి భేటీలో ఈ మేరకు ప్రతిపాదనలు అందాయని, వాటిపై తక్షణమే స్పందించాలని ప్రధాని జస్టిస్ ట్రూడో ఆదేశించినట్లు కరీనా పేర్కొన్నారు. భారత్‌కు తాము కేటాయించిన నిధులు, వైద్యోపకరణాలు కెనడియన్ రెడ్‌క్రాస్ ద్వారా భారత రెడ్‌క్రాస్ సొసైటీకి చేరుతాయని స్పష్టం చేశారు.

English summary
Karina Gould, Canada's Minister of International Development, announces that Canada is providing $10 million in funding for humanitarian assistance to Canadian Red Cross to support Indian Red Cross Society’s response to Covid 19 situation in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X