వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైలట్ పొగ త్రాగడం వల్ల ఆ విమానం ప్రమాదం జరిగి 51 మంది మృతి

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్ బాంబార్డియర్ యూబీజీ 211 విమానం గత ఏడాది కూలిపోయి, 51 మంది మృతి చెందారు. దీనికి కారణం పైలట్ పొగత్రాగడమే కారణమని విచారణలో తేలింది. విమానం నడుపుతున్న పైలట్ కాక్‌పిట్‌లో పొగ త్రాగటం వల్ల ఆ విమానం ప్రమాదానికి గురైనట్లుగా గుర్తించారు.

గత ఏడాది మార్చిలో నేపాల్‌లో ఈ విమానం ప్రమాదానికి గురైంది. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యాయి. కాక్‌పిట్‌లో పొగ త్రాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు. యూఎస్‌-బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్ యూబీజీ 211 విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్‌లోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగాయి.

Caused US-Bangla Plane Crash In Nepal That Killed 51 Last Year

ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు అందులో 67మంది ఉన్నారు. దీనిపై దర్యాఫ్తు చేపట్టారు. విచారణ చేపట్టిన ప్యానెల్‌ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్) పరిశీలించింది.

విమానం నడుపుతున్న సమయంలో పైలట్‌ నిబంధనలకు విరుద్ధంగా కాక్‌పిట్‌లోనే పొగ తాగినట్లు గుర్తించారు. కాక్‌పిట్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్‌ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయినట్లు తెలిపింది.

English summary
The US-Bangla airline Bombardier UBG-211 crash that occurred in March last year, took place as the pilot, who was in charge of the flight had smoked inside the cockpit despite restrictions, authorities confirmed on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X