సీజ్ ఫైర్ బ్రేక్.. మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్

ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే.. మరోవైపు కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్థాన్. కాల్పుల నిలుపుదలకు అంగీకరించిన కొద్ది గంటలకే పాక్ కుటిల బుద్ధిని ప్రదర్శించింది. జమ్మూ కశ్మీర్ లోని అనంతానాగ్, బుడ్గామ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. అంతే కాకుండా శ్రీనగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అఖ్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్తో దాడులు చేస్తోంది.

ఈ క్రమంలోనే స్ట్రాంగ్ కౌంటరివ్వాలని భారత ప్రభుత్వం BSFకు పూర్తి అధికారాలిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనగర్లో బ్లాకెట్ విధించారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని J&K CM ఒమర్ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా మారోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ సాయంత్రమే మిలిటరీ యాక్షన్, ఫైరింగ్ నిలిపివేతకు పాక్, భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే. కానీ ఈ తరహ చర్యలకు పాకిస్థాన్ పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ceasefire-break-and-pakistan-opens-fire-again-on-india

మరోవైపు జమ్మూలోని ఆర్‌ఎస్‌ పుర ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దులో కాల్పులు జరగగా.. బీఎస్‌ఎఫ్‌ ఎస్సై ఇంతియాజ్‌ అమరుడయ్యారు. సరిహద్దు ఔట్‌ పోస్టుకు ఆయన నేతృత్వం వహించినట్టు తెలుస్తోంది. ఇంతియాజ్‌ కుటుంబ సభ్యులకు బీఎస్ఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. అంతే కాకుండా సీజ్ ఫైర్ నేపధ్యంలో సరిహద్దు రాష్ట్రాలు కుదుటపడ్డాయి. పంజాబ్ బ్లాక్‌అవుట్‌ ఆంక్షలు ఎత్తివేయగా.. గుజరాత్‌లోని కచ్‌లోనూ బ్లాక్‌అవుట్‌ ఆంక్షలు సడలించారు.

ఇక కాల్పుల విరమణ ప్రకటన అనంతరం.. మోడీ ఉన్నతస్థాయి సమీక్షనిర్వహిస్తున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి జై శంకర్‌లతో భేటీ అవుతున్నారు. ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌, సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌తోపాటు త్రివిధ దళాల అధిపతులు హాజరు అయినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+