ఫోటోలు రిలీజ్: ఫ్యారిస్‌లో భయంభయంగా, చూసిన ప్రధాని(పిక్చర్స్)
ప్యారిస్: ప్యారిస్‌లోని వ్యంగ్య చిత్రాల వార పత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై ఈసిస్ మిలిటెంట్లు బుధవారం కాల్పులు జరిపి ప్రధాన సంపాదకుడు, నలుగురు కార్టూనిస్టులు సహా పన్నెండు మందిని హతమార్చారు. ఇస్లాం నినాదాలు చేసుకుంటూ ముసుగులు ధరించిన మిలిటెంట్లు పత్రిక కార్యాలయంలోకి ప్రవేశించి కలెష్నికోవ్ తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం ఓ కారును హైజాక్ చేసి పరారయ్యారు.
అతివేగంగా వెళుతున్న మిలిటెంట్ల కారుకింద పడి ఓ పౌరుడు మరణించాడు. దారిలో మరో ఇద్దరు పోలీసుల్నీ కాల్చి చంపారు. అల్లాహో ఆక్బర్ అంటూ మిలిటెంట్లు నినాదాలు చేశారని సాక్షులు వెల్లడించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్యారిస్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ముస్లిం ప్రవక్త పైన గతంలో వ్యంగ్య చిత్రాలను ప్రచురించి చార్లీ హెబ్‌డో పత్రిక ముస్లింల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంది.
మృతుల్లో చీఫ్ ఎడిటర్ స్ట్ఫోనే చార్బొనీర్, కార్టునిస్టులు కాబూ, టిగ్నౌస్, వొల్నిస్కీలు ఉన్నారు. ఇసిస్ మిలిటెంట్ల తరపున పోరాటం చేసేందుకు వందలాది మంది పౌరులు ఇరాక్, సిరియాలకు వెళ్లిపోయారన్న కథనాలు ఫ్రాన్స్‌లోనూ, ఇతర ఐరోపా దేశాల్లోనూ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం. సంఘటన గురించి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ మిలిటెంట్ల చర్యను తీవ్ర పదజాలంతో ఖండించారు. కాగా, ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. ఒకరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఫ్రాన్స్ అటాక్
మహ్మద్ ప్రవక్త కార్టూన్లను ప్రచురిస్తోందంటూ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చార్లీ హెబ్డో అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు.

ఫ్రాన్స్ అటాక్
ముసుగులు ధరించిన సాయుధులు ఆ పత్రిక కార్యాలయంలోకి చొరబడి పత్రిక ఎడిటర్‌ను, ఫ్రాన్స్‌లోనే పేరెన్నికగన్న కార్టూనిస్టులు సహా 10మంది సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు.

అంబులెన్సులు
ప్యారిస్‌లో వ్యంగ్య రచన పత్రికా కార్యాలయం పైన దాడి నేపథ్యంలో సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్సుల దృశ్యం.

ప్యారిస్ అటాక్
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చార్లీ హెబ్డో అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ప్యారిస్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ప్రధాని
ఈ ఘాతుకాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఫ్రాన్స్ ప్రధాని అభివర్ణించారు. గతంలో ఇలాంటి ఉగ్రవాద కుట్రల్ని భగ్నం చేశామని, తాజా దాడి నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఏ మాత్రం లేదని తెలిపారు.

భయంభయంగా...
ప్యారిస్‌లో వ్యంగ్య రచన పత్రికా కార్యాలయం పైన దాడి నేపథ్యంలో సంఘటన స్థలం వద్ద ప్రజలు భయంభయంగా ఉన్న దృశ్యం.

ప్రధాని
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఈ దాడిని అత్యంత అనాగరికమైన దాడిగా, ఉగ్రవాదులను పిరికివాళ్లుగా అభివర్ణించారు.

ప్రధాని
అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని కామెరూన్, తదితరులు ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన దుండగులను పట్టుకుని చట్టం ముందుకు తీసుకురావడానికి ఏ సహాయమైనా చేస్తామని ఒబామా హామీ ఇచ్చారు.

బెర్లిన్
బెర్లిన్‌లోని బ్రాండెన్ బర్గ్ గేట్ వద్ద భారీగా ప్రజలు గుమికూడి.. ప్యారిస్ దాడులలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

ప్యారిస్
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించివేయడానికి ప్రపంచమంతా ఏకం కావాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ అభిప్రాయపడ్డారు. ఇది అత్యంత హేయమైన దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications