గెరిట పట్టుకున్నవాడు గెరిటతోనే పోయాడు: చికెన్ సూప్‌లో పడి..! చెఫ్ విషాదాంతం..!
ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు చెప్పండి. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మరణించడం, అప్పటి వరకు అందరి మధ్య నవ్వుతూ కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా అదృశ్యం అవడం వంటివి చాలా చూస్తున్నాం చూశాం కూడా. ఇక ఇప్పుడు మీరు చదవబోయే కథ మాత్రం ఒక్కింత బాధతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. అవును ఈ ఘటన మనదేశంలో జరిగింది కాదు.. ఎక్కడో ఇరాక్ దేశంలో జరిగింది. అయినప్పటికీ ప్రపంచ వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఈ కథేంటో చూద్దామా..
ఇరాక్ దేశంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహ కార్యక్రమంలో వంట చేసేందుకు ఇస్సా ఇస్మాయిల్ అనే ఓ చెఫ్ ఒప్పుకున్నాడు. మరి పెళ్లి అంటే మామూలుగా ఉండదుగా.. కొన్ని వందల సంఖ్యలో అతిథులు వస్తారు. అంతేకాదు పెళ్లిలో అందరిని ఆకట్టుకునేది భోజనాలే. పెళ్లికి హాజరైన అతిథులు భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లి మాట్లాడుకునేది కూడా పెళ్లి భోజనాలు అందులోని మెనూ గురించే. సరే.. ఇదంతా పక్కన పెడితే పెళ్లికి విందుభోజనం తయారు చేస్తున్నాడు ఇస్మాయిల్. ఇందులో భాగంగా ఓ పెద్ద డేక్షాలో చికెన్ సూప్ వండటం ప్రారంభించారు. దానికి కావాల్సిన అన్ని పదార్థాలు వేశాడు. ఇక చికెన్ సూప్ బాగా మరుగుతోంది. ఇక దాన్ని కలిపే ప్రయత్నంలో ఒక్కసారిగా కాలుజారి పడిపోయాడు. అయితే పడిపోవడం ఎక్కడో పడలేదు.. వేడివేడిగా డేక్షాలో మరుగుతున్న చికెన్ సూప్‌లోకి పడిపోయాడు.

ఇంకేముంది... ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టాడు. అప్పటికే తన శరీరమంతా 70శాతం గాయాలతో నిండిపోయింది. వెంటనే దోహక్‌లోని ఓ హాస్పిటల్‌కు చికిత్సకు తరలించడం జరిగింది. వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచారు. అయితే ఇస్మాయిల్ మరణించాడన్న వార్త, ఆయన మరణానికి గల కారణం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజెన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే చెఫ్ ఇస్మాయిల్ గత 8ఏళ్లుగా ఇలా ఈవెంట్స్‌కు వంట చేస్తున్నాడని చాలా చక్కగా రుచికరంగా వంటలు వండుతాడని ఇస్మాయిల్‌తో పరిచయం ఉన్న వారు గుర్తుచేసుకున్నారు.
ఇస్మాయిల్ పెళ్లిళ్లకు, ఎవరైన చనిపోతే వారింట్లో జరిగే సంస్మరణ సభలకు వంట చేసేవాడని, రోజుకు 25వేల ఇరాకీ దినార్లు సంపాదించేవాడని బంధువులు గుర్తుచేసుకున్నారు. ఇస్మాయిల్‌కు ముగ్గురు పిల్లలు ఉండగా అందులో ఒకరికి ఆరు నెలల వయసు మాత్రమే అని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక ఇస్మాయిల్ మరణంతో ఆదేశంలోని రెస్టారెంట్లు అలర్ట్ జారీ చేశాయి. కిచెన్‌లో జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications