చికెన్ టిక్కా మసాలా వంటకాన్ని కనిపెట్టిన ఆ చెఫ్ ఇక లేరు..!
భోజన ప్రియులకు.. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన చికెన్ టిక్కాలలో ఉపయోగించే మసాలా ను కనిపెట్టిన చెఫ్ కన్నుమూశారు. గ్లాస్గో నగరానికి చెందిన అలీ అహ్మద్ అస్లాం అనారోగ్యంతో కన్నుమూశారు. సీనియర్ చెఫ్ అయిన అలీ అహ్మద్ అస్లాం వయసు 77 సంవత్సరాలు.
1970 వ సంవత్సరంలో ఆయన తన రెస్టారెంట్ శిష్ మహల్ లో టమాటా సూప్ తో చేసిన సాస్ ను మెరుగుపరచడం ద్వారా చికెన్ టిక్కా మసాలా తయారు చేశారు. ఆ తర్వాత అది చాలా ఫేమస్ అయ్యింది. ఈ వంటకం బ్రిటిషు రెస్టారెంట్ లలో అత్యంత ప్రజల ఆదరణ పొందింది. ప్రపంచ వ్యాప్తంగానూ తినే వారు పెరిగిపోయారు. అయితే కస్టమర్ల అభిరుచికి తగినట్టుగా చికెన్ టిక్కా మసాలా తయారు చేస్తామని గతంలో ఈ వంటకాన్ని తయారు చేసిన అలీ అహ్మద్ అస్లాం పేర్కొన్నారు.

2009లో ఆయన తన ఇంటర్వ్యూ లో చికెన్ టిక్కా చాలా పొడిగా ఉందని కస్టమర్ ఫిర్యాదు చేయడంతో, దానిని మరింత మెరుగు పరచడం కోసం చికెన్ టిక్కా మసాలా తాను తయారు చేశానని పేర్కొన్నారు. చికెన్ టిక్కా పొడిగా ఉన్న కారణంగా కస్టమర్ తాను సాస్ తో చికెన్ టిక్కా తీసుకోవాలని భావిస్తున్నాను అని చెప్పడంతో తాము చికెన్ ఉడికించేటప్పుడు సాస్ తో కలిపి ఉడికించాలి నిర్ణయించామని, ఆ తర్వాత పెరుగు, క్రీమ్, మసాలాలు ఉన్న సాస్ తో చికెన్ టిక్కా మసాలా తయారు చేశామని తన ఇంటర్వ్యూలో చెప్పారు.
అహ్మద్ అస్లాం మృతితో గ్లాస్కో లోని ఆయన శిష్ మహల్ రెస్టారెంట్ మూసివేశారు. ఆయన మృతితో ఆయనపై గౌరవసూచకంగా 48 గంటల పాటు రెస్టారెంట్ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. వంటలో కస్టమర్ల రుచిని అర్థం చేసుకొని చికెన్ టిక్కా మసాలా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరితో తినిపించిన చెఫ్ మృతితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెఫ్ లు ఆయన మృతి పట్ల నివాళులర్పిస్తారు.












Click it and Unblock the Notifications