Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలికపై అత్యాచారం: రేపిస్టును ఉరి తీశారు

ఇస్లామాబాద్: ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను హత్య చేసిన దోషి అబ్దుల్ గఫూర్‌ను బుధవారం తెల్లవారు జామున పాకిస్తాన్‌లో ఉరి తీశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని విహరి జిల్లా జైలులో పోలీసుల ఉన్నతాధికారుల సమక్షంలో ఉరిశిక్షను అమలు చేశారు.

అబ్దుల్ గఫూర్ 1991లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను చంపేశాడు. దీంతో అతడికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే, దేశంలో ఉరిశిక్షపై నిషేధం ఉన్న కారణంగా అతడు జీవిత ఖైదు అనుభవిస్తూ వచ్చాడు.

Child rapist, murderer executed in Pakistan

నిరుడు డిసెంబర్‌లో పెషావర్‌లోని ఆర్మీ పాఠశాలపై తాలిబన్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 140 మంది మరణించారు. మృతుల్లో అత్యధికులు విద్యార్థులే. దీంతో దేశంలో ఉరిశిక్షపై ఉన్న నిషేధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో దేశంలో ఉరిశిక్షలు పడి వివిధ జైలులో ఉన్న ఖైదీలకు ఉరిశిక్షలు అమలు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అబ్దుల్ గఫూర్‌ను బుధవారం తెల్లవారు జామున ఉరితీశారు. తనకు క్షమాభిక్ష పెట్టాలని అబ్దుల్ గఫూర్ పెట్టుకున్న దరఖాస్తును దేశాధ్యక్షుడు తిరస్కరించారు దీంతో అతన్ని ఉరి తీశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+