వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Meteor: ఆకాశంలో అద్భుతం.. అర్ధరాత్రి దూసుకొచ్చిన ఉల్కాపాతం.. వీడియో వైరల్..

|
Google Oneindia TeluguNews

ఆకాశంలో అర్ధరాత్రి అద్భుతం ఆవిష్కృతమైంది. మిరుగులు చిమ్ముకుంటూ ఉల్కాపాతం భూవి వైపు వచ్చింది. చిలీ రాజధాని శాంటియాగోలో రాత్రిపూట ఆకాశంలో ఒక ఉల్కాపాతం కెమెరాకు చిక్కింది.జూలై 7న భూమి వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్కాపాతం కాలిపోయిందిని కన్సెప్సియన్ విశ్వవిద్యాలయం ఫ్రోపెసర్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బ్రెజిలియన్ మీడియా అవుట్‌లెట్ TNH1 ప్రకారం, నగరవాసులు ఉల్క వాతావరణాన్ని దాటుతున్న శబ్దాన్ని ఉరుముల శబ్దం వచ్చినట్లు చెప్పారు.

భాగాలుగా వీడిపోయింది..
అధికారులను ఉటంకిస్తూ, స్థానిక మీడియా సంస్థలు అండీస్ ప్రాంతంలో అదృశ్యమయ్యే ముందు ఉల్క అనేక భాగాలుగా విడిపోయిందని నివేదించింది. ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. చిలీ ఖగోళ శాస్త్ర ఫౌండేషన్ ఖగోళ శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ బీమిన్ మాట్లాడుతూ, శాంటియాగోను దాటుతున్న ఉల్కాపాతాన్ని "T12.cl" అని పిలుస్తారని చెప్పారు. ఒక ఫ్లాష్ వెలిగిపోయిందని బీమిన్ వివరించాడు. ఎందుకంటే ఉల్కాపాతం వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలితో ఘర్షణ కారణంగా, కాలిపోయి మెరుస్తుందన్నారు. దీని వేగం గంటకు 10,000 కిలోమీటర్ల వేగం ఉంటుందన్నారు.

Chile: Huge Meteor Brightens Up Night Sky, Leaves Netizens Mesmerised

ఈ వీడియోపై వీక్షకులు అనేక కామెంట్లు చేశారు. ఏదో రకమైన రవాణా వస్తువు వలె కనిపిస్తుందని, ఇది ఎల్లప్పుడూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత కాలిపోతుందని రాసుకొచ్చారు.

English summary
A meteor has been caught on camera streaking through the night sky over Chile's capital Santiago. Scholars from Concepcion University confirmed that the phenomenon, which was recorded on July 7, was a small body of rock which burned up upon entering the Earth's atmosphere, the BBC reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X