కాల్పుల విరమణకు పాక్ తూట్లు.. పాకిస్థాన్​ కు అండగా ఉంటాం.. చైనా సంచలన ప్రకటన

పాకిస్థాన్ మరోసారి దొంగ దెబ్బ తీసింది. కాల్పుల విరమణకు తల ఊపినట్లే ఊపి తోక జాడించింది. అర్థరాత్రి జమ్మూలో మోటార్​ షెల్లింగ్​, డ్రోన్​ లతో వరుసగా నాలుగోరోజూ దాడులకు పాల్పడింది. పాక్ దాడుల్లో కశ్మీర్​ ప్రభుత్వ అధికారి, ఇద్దరు భద్రతా అధికారులు సహా 7 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. నగ్రోటా వద్ద భారత్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ యత్నం చేసింది. అయితే చొరబాటుదారులపై భారత ఆర్మీ కాల్పులు జరిపింది.

మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై భారత్ మండిపడింది. ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ల మధ్య టెలిఫోన్ సంభాషణ నడిచింది. 'పహల్గాం ఉగ్రదాడి వల్ల ఎంతో ప్రాణనష్టం జరిగింది. అందుకే ఉగ్రవాదంపై కీలక నిర్ణయం తీసుకున్నాం. భారతదేశానికి యుద్ధం అనేది ప్రాధాన్యం కాదు. భారత్​, పాకిస్థాన్ ​తో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంది.. అని అజిత్ దోవల్ తెలిపారు.

ఇక పహల్గాం ఉగ్రదాడిని చైనా కూడా ఖండించింది. ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అయితే భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్​ తో.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. తమ మిత్రదేశమైన పాకిస్థాన్ ​కు చైనా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.

China Backs Pakistan Amid Ceasefire Violation Row

అయితే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గమని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మండిపడ్డారు. నాలుగోరోజూ పాకిస్థాన్.. సరిహద్దుల వెంబడి కాల్పులకు, డ్రోన్ దాడులకు పాల్పడుతోందన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని తెలిపారు. పాక్‌ దాడులకు భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోందన్నారు. కాల్పుల వివరణ ఒప్పందం ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్థాన్​ దేనని ఈ మేరకు మిస్రీ తెలిపారు.

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య నిన్న రాత్రి నుంచీ తాము జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయన్నారు. భారత్, పాకిస్తాన్.. సమయస్ఫూర్తి, కామన్ సెన్స్ వాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+