• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా... ప్రమాదం పొంచి ఉందా..?

|

బీజింగ్: సరికొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించడంలో చైనాది అందె వేసిన చేయి. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో పలు రకాల ప్రయోగాలు చేసి అగ్రరాజ్యాలకే సవాలు విసురుతోంది డ్రాగన్ కంట్రీ. కొద్ది రోజుల క్రితం అరుణగ్రహంపై రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయించి కొత్త రికార్డు సృష్టించిన చైనా... తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టించడంలో సక్సెస్ అయ్యింది. ఇంతకీ ఈ కథేంటో ఓ సారి చూద్దాం

  China’s Artificial Sun ప్రపంచంలోనే అతిపెద్ద.. Fusion Reactor Sets Record || Oneindia Telugu

  హైడ్రోజన్ మరియు హీలియంల అణుకలయికతో సూర్యుడికి మండే స్వభావం ఏర్పడుతుంది. 15మిలియన్ డిగ్రీల సెల్సియస్ వద్ద సూర్యుడు ఎర్రటి నిప్పులను కక్కుతాడు. అలాంటి సూర్యుడినే చైనా తయారు చేసింది. సింపుల్‌గా చైనా కృత్రిమ సూర్యుడిని తయారు చేసిందని చెప్పొచ్చు. అంతేకాదు 120 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఈ కృత్రిమ సూర్యుడి ద్వారా 101 సెకన్ల పాటు సృష్టించినట్లు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. అణుప్రక్రియ ద్వారా సూర్యుడు ఎలాగైతే వేడిమిని సృష్టిస్తాడో చైనా రూపొందించిన ప్రయోగాత్మక అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టోకామాక్ (ఈస్ట్) పరికరం ద్వారా ఈ ఉష్ణోగ్రతను సృష్టించారు.

  China creates artificial sun,Its fusion reactor sets a new record

  ఇదిలా ఉంటే ఈస్ట్ పరికరం యాక్టివేట్ కాగానే ఓ 20 సెకన్ల పాటు ఉష్ణోగ్రత 160 మిలియన్ డిగ్రీల సెల్సియస్‌ను కూడా తాకింది. అంటే నిజమైన సూర్యుడి నుంచి వచ్చే వేడిమికన్నా ఇది 10 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్పారు. చైనాలోని హెఫీ ప్రాంతంలో ఉన్న ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ ఆఫ్ చైనీస్ అకాడెమీలో ఈ ప్రయోగం నిర్వహించారు. ఈస్ట్ యొక్క ఏకైక లక్ష్యం సూర్యుడి నుంచి వేడిమి ఎలా అయితే సృష్టించబడుతుందో అదే పద్దతిలో కృత్రిమంగా సూర్యరశ్మిని క్రియేట్ చేయడమే అని పరిశోధకులు చెబుతున్నారు.

  ఇక అణుకలయిక జరిగేందుకు హైడ్రోజన్ అణువులపై అధిక ఉష్ణోగ్రత పీడనం అప్లయ్ చేయడం జరుగుతుంది. తద్వారా రెండు ఒకటిగా అవుతాయి. అణువులు విచ్ఛిన్న చేయకుండా అణుసంలీన ప్రక్రియతో అణువులు వ్యర్థంగా పోవు కాబట్టే ఈ ప్రక్రియ సురక్షితమైనదిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాదు న్యూక్లియర్ ఫ్యూజన్ ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా అపరిమితంగా స్వచ్ఛమైన శక్తిని అందించగలదు.

  అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ ఫెసిలిటీలో భాగంగా చైనా ఈ ప్రతిష్టాత్మకమైన ఈస్ట్ ప్రాజెక్టును చేపట్టింది. 2035లో ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌గా రికార్డుకెక్కుతుంది. ఈ ప్రాజెక్టులో దక్షిణకొరియా, జపాన్, రష్యా, భారత్, అమెరికాలాంటి దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే అధిక ఉష్ణోగ్రత మరింత ఎక్కువ సేపు మెయిన్‌టెయిన్ అయ్యేలా లక్ష్యంగా పెట్టుకుంది ఈస్ట్ ప్రాజెక్ట్.

  English summary
  China set a new record with “artificial sun” after it ran at 120 million degrees Celsius for 101 seconds, according to the state media
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X