చైనాను కుదిపేసి.. ఢిల్లీని వణికించి
China earthquake: చైనాలో పెను భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. భూకంపం తీవ్రతకు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ ధ్వంసమైంది. రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని భవనాలు బీటలు వారినట్లు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీని తీవ్రత అటు ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోనూ కనిపించింది. స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి.
చైనా కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తరువాత 2:09 నిమిషాలకు చైనా దక్షిణ ప్రాంతంలోని గ్ఝిన్‌జియాంగ్ రీజియన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. అక్సు ప్రీఫెక్షర్ రీజియన్ వుషి కంట్రీలో భూమి ప్రకంపించినటలు చైనా భూకంపాల నెట్‌వర్క్ సెంటర్ తెలిపింది.

కిర్గిజిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది గ్ఝిన్ జియాంగ్ రీజియన్. ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ ఘటన సంభవించినట్లు నెట్‌వర్క్ సెంటర్ వివరించింది. దీని తీవ్రతకు వుషి కంట్రీలో కొన్ని భవనాలు బీటలు వారినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
భూమి ప్రకంపించిన వెంటనే స్థానికులు భయంతో రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాతా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు. గడ్డ కట్టించే చలిలో రోడ్ల మీదే జాగారం చేశారు. అటు దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. ఘజియాబాద్, గ్రేటర్ నొయిడా, గుర్‌గావ్.. వంటి నగరాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications