చైనా ను ఆదుకొనేదెవరు : కరోనా విలయం - రోజుకు 5వేల మంది మృతి..!!

కరోనాకు పుట్టినిల్లు అయినా చైనా ఇప్పుడు కల్లోలంలో కూరుకుపోయింది. చైనాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో రోజుకు పది లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయని.. నిత్యం 5 వేల మరణాలు ఉండే అవకాశం ఉందని ఒక ఆధ్యయనంలో వెల్లడైంది. వచ్చే నెలలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ అనే పరిశోధన అధ్యయనంలో వెల్లడైంది. కరోనా బాధితులతో చైనాలోని పలు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయని పేర్కొంది.

బెడ్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ఫ్రీజర్లు సరిపోకపోవడం వల్ల మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అధికారులే చెబుతున్నారు. చైనా ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న లెక్కల ప్రకారం రోజువారీ కేసుల సంఖ్య 3 వేలకు పైగా ఉంది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. దీనికి కారణం ఆర్టీపీసీఆర్‌ టెస్టులను చైనా ప్రభుత్వం పూర్తిగా తగ్గించేసింది. ప్రజలందరూ ఇప్పుడు రాపిడ్‌ టెస్టులపై ఆధారపడుతున్నారు. ఆ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినవేవీ ప్రభుత్వ లెక్కల్లోకి రావట్లేదు. పెద్ద ఎత్తున వైరస్‌ బారిన పడ్డ ప్రజలకు కావాల్సిన మందులు కూడా దొరకని పరిస్థితి అక్కడ నెలకొన్నట్టు సమాచారం.

China Expected To Register 1 Million Cases, 5000 Deaths Per Day according to a recent research

ఇదే సమయంలో..మరో కీలక అంశాన్ని లండన్ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. వచ్చే నెల నాటికి చైనాలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 37 లక్షలకు, మార్చినాటికి ఆ సంఖ్య 42 లక్షలకు చేరే ప్రమాదం ఉంది. ఈ వేవ్‌ జనవరి మధ్య దాకా కొనసాగి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని.. తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో వేవ్‌ వస్తుందని.. మూడో వేవ్‌ ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 15 దాకా కొనసాగుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. నివేదికలు ఇలా ఉంటే. చైనా యంత్రాంగం మాత్రం బుధవారం కేవలం 2,996 కేసులు మాత్రమే వచ్చాయని చెబుతోంది.

China Expected To Register 1 Million Cases, 5000 Deaths Per Day according to a recent research

డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 10 కంటే తక్కవ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మాస్ టెస్టింగ్ కేంద్రాలను చైనా మూసివేసినట్లు తెలుస్తోంది. చాలా మంది ఇంటి వద్దే కరనా పరీక్షల నిర్వహించుకుంటున్నారు. అయితే, కరోనా కారణంగా మరణం రికార్డు చేసే అంశంలో కీలకమైన నిర్వచనాన్నే చైనా మార్చేసింది. దీంతో, కరోనా కారణంగా మరణించిన వారి లెక్కల్లో పొంతన కుదరటం లేదు. మరణాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందనే వాదన ఉంది. దీంతో, చైనాలో వాస్తవ పరిస్థితులు ఏంటనేది అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+