• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా షాకింగ్: చైనా కుట్ర బట్టబయలు.. జిన్ పింగ్ తప్పుకు ప్రపంచం బలి.. సీక్రెట్ డాక్యుమెంట్లలో..

|

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1లక్ష 30వేల బలి తీసుకుని.. మరో లక్ష మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న కరోనా మహమ్మారికి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటపడింది. మొదటి నుంచీ అందరూ అనుమానిస్తున్నట్లే ఈ విలయానికి చైనాయే కారణమని ఇప్పుడు ఆధారాలతో సహా రుజువైంది. చైనా కమ్యూనిస్ట్ దేశం కాబట్టే దానిపై కుట్రలు పన్నుతున్నారన్న వాదనను పటాపంచలు చేస్తూ, ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ 'అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)' సంచలన రిపోర్టు వెల్లడించింది.

డాక్యుమెంట్ల ఆధారంగా..

డాక్యుమెంట్ల ఆధారంగా..

చైనాలోని వూహాన్ సిటీలో కరోనా వైరస్ పుట్టిన తొలిరోజుల్లో అక్కడేం జరిగిందో, స్థానిక వైద్యులు, అధికారులు ఏం చేశారో, ఫ్రావిన్స్ అధికారులకు, ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు ఎలాంటి నివేదికలు పంపారు, వాటిలో పేర్కొన్న విషయాలేంటి? సదరు రిపోర్టులపై జిన్ పింగ్ తీసుకున్న నిర్ణయాలు.. తదితర వ్యవహారాలకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్లను ‘ఏపీ' బయటపెట్టింది. వాటి ఆధారంగా చైనా ఎంత పెద్ద తప్పుచేసిందో, దాని వల్ల మిగతా ప్రపంచం ఎంత దారుణంగా ఎఫెక్ట్ అయిందో కథనంలో వివరించింది.

ఆ ఆరు రోజులు..

ఆ ఆరు రోజులు..

చైనా హుబే ఫ్రావిన్స్, వూహాన్ సిటీలోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్తరకం జబ్బు పుట్టుకొచ్చినట్లు చైనీస్ డాక్టర్లు గతేడాది డిసెంబర్ 1న గుర్తించారు. అంతుచిక్కని రీతిలో చనిపోయిన ఇద్దరి శాంపిల్స్ పై పరిశోదనలు చేశారు. జనవరి 14 నాటికి ఆ గుర్తు తెలియని కారకాన్ని ‘కరోనా వైరస్'గా గుర్తించారు. ప్రమాద తీవ్రతను అధికారులు.. ప్రెసిడెంట్ జిన్ పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆయన పబ్లిక్ అనౌన్స్‌మెంట్ కు అంగీకరించలేదు. అయితే, జనవరి 20 నాటికి అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 3వేలకు పెరిగింది. అప్పుడుగానీ చైనా ప్రభుత్వం తొలిసారి అధికారికంగా హెచ్చరికలు జారీచేయలేదు. ఆ ఆరు రోజుల ఆలస్యమే ఇప్పుడు ప్రపంచానికి శాపంగా మారింది.

ఎందుకలా చేశారంటే..

ఎందుకలా చేశారంటే..

చైనీస్ డాక్టర్లు, సైంటిస్టులు ‘కరోనా వైరస్'ను గుర్తించిన సమయానికి ఆదేశంలో కొత్త సంవత్సరం(లూనార్ న్యూఇయర్) వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రజలు విపరీతంగా ప్రయాణాలు చేశారు. విదేశాల్లో నివసిస్తోన్న చైనీయులు కూడా ఇళ్లకు వచ్చివెళ్లారు. వైరస్ ప్రమాదాన్ని గుర్తించిన జనవరి 14 నాడే ప్రభుత్వం హెచ్చరికలు చేసేదుంటే పరిస్థితి మరో లా ఉండేదని, ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటన చేయడం ద్వారా అప్పటికే పలువురు వైరస్ బాధితులు సరిహద్దులుదాటి వెళ్లిపోయారని వెల్లడైంది. అదీగాక, ముందుకు ముందే హెచ్చరికలు జారీచేసి, తర్వాత తీవ్రత లేదని తెలిస్తే ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే ప్రకటన చేద్దామని ప్రెసిడెంట్ జిన్ పింగ్ అధికారులతో అన్నట్లు డాక్యుమెంట్లలో వెల్లడైంది.

పక్కదేశం చెప్పినా వినలేదు..

పక్కదేశం చెప్పినా వినలేదు..

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంలో చైనా చేస్తున్న జాప్యంపై దాని పొరుగుదేశమైన థాయిలాండ్ కూడా హెచ్చరించిందని, థాయిలాండ్ లో జనవరి 13న తొలి కరోనా మరణం సంభవించగా, మృతుడికి సంబంధించిన రిపోర్టులను చైనాకు కూడా పంపారని ఏపీ తన కథనంలో పేర్కొంది. అయితే చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) సంస్థ మాత్రం జనవరి 17 దాకా తమ దేశంలో కేసులేవీ నమోదుకాలేదని బుకాయించింది. కానీ వాస్తవానికి జనవరి 5 నుంచే వూహాన్ సిటీలో కొన్ని వేల మంది ఆస్పత్రులపాలైనట్లు రిపోర్టులు లభ్యమయ్యాయి. చైనాలో మీడియాపై నియంత్రణ ఉన్న కారణంగా చాలా విషయాలు బయటి ప్రపంచానికి రిపోర్టు కాలేదు.

తప్పించుకునే ప్రయత్నం..

తప్పించుకునే ప్రయత్నం..

కరోనా వైరస్ విషయంలో ఇప్పటికే చైనాపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఇన్ సైడ్ డాక్యుమెంట్ల ఆధారంగా ‘ఏపీ'న్యూస్ ఏజెన్సీ రాసిన కథనం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చైనా మాత్రం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జావ్ లిజియాన్ బుధవారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ కు సంబంధించి తమ దగ్గరున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో)తో పంచుకుంటూ వచ్చామని, ‘ఏపీ'కథనంలోని అంశాలు సత్యదూరంగా ఉన్నాయని లిజియాన్ అన్నారు.

  Fake News Buster : 05 కాణిపాకం గుడి క్వారంటైన్ సెంటరా ? బాంద్రా లో జరిగిన దానికి కారణం ఫేక్ న్యూస్
  ఇదీ తాజా పరిస్థితి..

  ఇదీ తాజా పరిస్థితి..

  కొవిడ్-19 వ్యాధికి మందు అందుబాటులోకి రాకపోవడంతో, సోషల్ డిస్టెన్సింగ్, క్వారంటైన్ ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికడుతున్నారు. ఆ లెక్కన తొలి ఆరు రోజుల్లో చైనా చేసింది భారీ తప్పిదమేనని పలువురు అపిడమాలజిస్టులు అభిప్రాయపడ్డారు. బుధవారం రాత్రి నాటికి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 20 లక్షలు దాటింది. అందులో సుమారు 5 లక్షలమంది రికవరీకాగా, 1.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 26,334మంది, ఇటలీలో 21,645మంది, స్పెయిన్ 18,579, ఫ్రాన్స్ 15,729, యూకేలో 12,868మంది చనిపోయారు. వైరస్ పుట్టిన చైనాలో ప్రస్తుతానికి కేసుల సంఖ్య 82,295గా ఉంది. అక్కడ 3,342 మంది చనిపోయారు. బుధవారం ఒకేఒక మరణం నమోదైంది.

  English summary
  Officials delayed announcement for six days allowing over 3,000 new cases to emerge, according to internal documents. President Xi Jinping warned the public on January 20 - the seventh day - but by then, more than 3,000 people had been infected
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X